టీడీపీ నేత మాణిక్యరావుపై పోలీసుల దాడి

ABN , First Publish Date - 2021-01-25T01:15:37+05:30 IST

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న జిల్లాలోని పెనుమాక ఆశ వర్కర్ విజయలక్ష్మి మృతి దుమారం రేపుతోంది. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో..

టీడీపీ నేత మాణిక్యరావుపై పోలీసుల దాడి

గుంటూరు: కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న జిల్లాలోని పెనుమాక  ఆశ వర్కర్ విజయలక్ష్మి మృతి దుమారం రేపుతోంది. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో విజయలక్ష్మి మృతి చెందింది. అయితే బ్రెయిన్ స్ట్రోక్‌తోనే విజయలక్ష్మి చనిపోతుందని వైద్యులు ప్రకటించారు. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు, ఆశ వర్కర్లు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. దీంతో ఆశ వర్కర్స్ యూనియన్‌తో కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ చర్చలు జరిపారు. రూ.50 లక్షలు పరిహారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతామని హామీ ఇచ్చారు. 


కలెక్టర్ హామీపై నమ్మకం లేదు: విజయలక్ష్మి కుటుంబ సభ్యులు 

అయితే విధుల్లో లేని ఈ కలెక్టర్ హామీపై నమ్మకం లేదని కుటుంబ సభ్యులు చెప్పారు. విజయలక్ష్మి  కుటుంబ సభ్యులకు టీడీపీ నేతలు మద్దతుగా నిలిచారు. టీడీపీ నేత మాణిక్యరావుపై పోలీసులు దాడి చేశారు. తాడేపల్లి మండలం పెనుమాకలో ఆశ వర్కర్‌గా పని చేస్తున్న విజయలక్ష్మి ఈ నెల 19న వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. 21న కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో జీజీహెచ్‌లో విజయలక్ష్మికి చికిత్స అందించారు. శనివారం ఆమెను జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి యాస్మిన్ పరామర్శించారు. విజయలక్ష్మికి బ్రెయిన్ స్ట్రోక్‌గా వైద్యులు నిర్ధారించారు. ఆదివారం ఉదయం విజయలక్ష్మి మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. 

Updated Date - 2021-01-25T01:15:37+05:30 IST