Punjab: ఆరు రూపాయలతో లాటరీ టికెట్.. మారిపోయిన కానిస్టేబుల్ తలరాత.. స్టోరీ వైరల్

ABN , First Publish Date - 2022-08-06T01:58:37+05:30 IST

అతడు ఒక కానిస్టేబుల్.. రాజస్థాన్‌(Rajastan) కి చెందిన ఆ వ్యక్తి పంజాబ్‌ పోలీసు శాఖలో పనిచేస్తున్నాడు.

Punjab: ఆరు రూపాయలతో లాటరీ టికెట్.. మారిపోయిన కానిస్టేబుల్ తలరాత.. స్టోరీ వైరల్

అతడు ఒక కానిస్టేబుల్.. రాజస్థాన్‌(Rajastan) కి చెందిన ఆ వ్యక్తి  పంజాబ్‌ పోలీసు శాఖలో పనిచేస్తున్నాడు.. అదృష్టం కలిసి రావడంతో అతను గంటల వ్యవధిలో కోటీశ్వరుడై పోయాడు.. అదీ కేవలం ఆరు రూపాయల ఖర్చుతో.. అతడి కథ వింటే షాకవడం ఖాయం. కుల్దీప్ సింగ్ అనే కానిస్టేబుల్ ఉద్యోగ నిమిత్తం తరచుగా లూథియానాకు (Ludhiana) వెళ్లేవాడు. అలా వెళ్లినప్పుడల్లా అక్కడి రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉండే ఓ ఏజెంట్ నుంచి నాగాలాండ్ లాటరీ సంస్థకు చెందిన టికెట్ కొనేవాడు. 


ఇది కూడా చదవండి..

Gujarat Teacher: ట్యూషన్ టీచర్ అమానుషం.. విద్యార్థిని చేత బలవంతంగా మందు తాగించి..



నిజానికి కుల్దీప్‌నకు లాటరీ టికెట్ కొనే అలవాటు లేదు. ఆరు నెలల క్రితం తన తల్లి లాటరీ టికెట్ కొనాలని చెప్పడంతో అప్పటి నుంచి కుల్దీప్ లాటరీ టికెట్ కొనడం మొదలుపెట్టాడు. ఎప్పడు లుథియానా వెళ్లినా కచ్చితంగా లాటరీ టికెట్ కొనేవాడు. గతంలో ఒకసారి రూ.6వేలు గెలుచుకున్నాడు. ఎప్పటికైనా ఎక్కువ మొత్తంలో డబ్బు గెలుచుకోవచ్చనే ఆశతో లాటరీ టికెట్లు కొనడాన్ని అలవాటు చేసుకున్నాడు. గత మంగళవారం లుథియానా వెళ్లినప్పుడు 6 రూపాయల చొప్పున 150 రూపాయలకు 25 టికెట్లు కొన్నాడు. 


అదేరోజు రాత్రి డ్యూటీలో ఉన్న సమయంలో అతడికి టికెట్ అమ్మే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్నారని (Police constable won lottery) చెప్పడంతో అతను సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. లాటరీలో గెలుచుకున్న డబ్బుతో తన కొడుకును మంచి చదువు చదివిస్తానని, పేద పిల్లల చదువు కోసం కొంత మొత్తం ఇస్తానని చెప్పాడు. మరికొంత మొత్తాన్ని గురుద్వారాకు విరాళంగా ఇస్తానని చెప్పాడు. ఇక ముందూ లాటరీ టికెట్‌లు కొంటూనే ఉంటానని, గెలుచుకున్న మొత్తాన్ని సామాజిక కార్యక్రమాలకు ఉపయోగిస్తానని చెప్పాడు. 

Updated Date - 2022-08-06T01:58:37+05:30 IST