కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసిన పోలీస్ ఉన్నతాధికారులు.. ఎందుకో తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2022-01-10T18:37:05+05:30 IST

అతను మధ్యప్రదేశ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు..

కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసిన పోలీస్ ఉన్నతాధికారులు.. ఎందుకో తెలిస్తే షాక్!

అతను మధ్యప్రదేశ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.. కొన్ని సంవత్సరాలుగా సర్వీసులో ఉన్నాడు.. అతడిని సస్పెండ్ చేస్తూ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ప్రశాంత్ శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.. ఇంతకీ అతడు చేసిన నేరం ఏంటంటే.. మీసం ట్రిమ్ చేసుకోకుండా పొడవుగా పెంచుకోవడం.. ఆ కారణంతోనే ఆ కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారి సస్పెండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. సస్పెండ్ చేస్తే ఇంట్లో కూర్చుంటాను గానీ, మీసం కత్తిరించేది లేదని ఆ కానిస్టేబుల్ చెప్పడం విశేషం. 


మధ్యప్రదేశ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ప్రశాంత్ శర్మ వద్ద ఏడాది కాలంగా రాకేష్ రానా అనే కానిస్టేబుల్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రాకేష్‌కు మీసం పొడవుగా పెంచడం అంటే చాలా ఇష్టం. ఎప్పట్నుంచో తన మీసాన్ని రాకేష్ అలాగే ఉంచుకున్నాడు. అయితే నాలుగు నెలల క్రితం మీసం కత్తిరించుకోవాల్సిందిగా రాకేష్‌కు ప్రశాంత్ సూచించారు. అయినా రాకేష్ మాత్రం తన మీసాన్ని ట్రిమ్ చేసుకోలేదు. దీంతో క్రమశిక్షణ చర్యల పేరు చెప్పి రాకేష్‌ను ప్రశాంత్ సస్పెండ్ చేశారు. ఆ మేరకు శుక్రవారం ఉత్తర్వు వెలువరించారు. 


`పొడవు మీసం వల్ల సస్పెండ్ చేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఎంతో మంది సీనియర్ పోలీస్ అధికారులు కూడా పొడవు మీసాలతో ఉన్నారు. నేను ప్రశాంత్ గారి వద్ద ఏడాదిగా పనిచేస్తున్నాను. గతంలో ఒకసారి మీసం కత్తిరించుకోమని చెప్పారు. ఆ తర్వాత మళ్లీ అడగలేదు. హఠాత్తుగా ఇప్పుడు సస్పెండ్ చేశారు. నేను సస్పెన్షన్‌ను అంగీకరిస్తాను కానీ, నా మీసాన్ని మాత్రం కత్తిరించుకోను. అది నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమ`ని రాకేష్ చెప్పాడు.  

Updated Date - 2022-01-10T18:37:05+05:30 IST