Mamata Banerjee: వారిపై కాల్పులు జరిపి ఉండొచ్చు...కానీ...

ABN , First Publish Date - 2022-09-15T00:39:27+05:30 IST

సెక్రటేరియట్‌ వరకూ బీజేపీ చేపట్టిన 'నబన్న అభిజాన్' సమయంలో బీజేపీ నిరసనకారులు హింసాత్మక ..

Mamata Banerjee: వారిపై కాల్పులు జరిపి ఉండొచ్చు...కానీ...

కోల్‌కతా: సెక్రటేరియట్‌ వరకూ బీజేపీ చేపట్టిన 'నబన్న అభిజాన్' సమయంలో బీజేపీ  (Bjp) నిరసనకారులు హింసాత్మక చర్యలకు (Violence) పాల్పడ్డారని, పోలీసులు కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ప్రభుత్వం ఎంతో సంయమనం (Restraint) పాటించిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. కాషాయం పార్టీ రాష్ట్రం బయట నుంచి బాంబులతో సహా గూండాలను రైళ్లలో తీసుకువచ్చిందని ఆరోపించారు.


''ర్యాలీలో పాల్గొన్న నిరసనకారులు పోలీసులపై అత్యంక పాశవికంగా దాడి చేశారు. పోలీసులు కాల్పులు జరిపి ఉండొచ్చు. కానీ మా ప్రభుత్వం గరిష్ట స్థాయిలో సంయమనం పాటించింది'' అని పూర్బ మిడ్నాపూర్ జిల్లాలోని నింటౌరిలో జరిపిన అడ్మినిస్ట్రేటివ్ మీటింగ్‌లో మమత అన్నారు. దుర్గాపూజలు ప్రారంభం కావడానికి మరి కొద్ది వారాలే ఉన్న తరుణంలో బీజేపీ నిరసన ప్రదర్శన కారణంగా సామాన్య ప్రజానీకం, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు జరుపుకొనేందుకు తమకెలాంటి అభ్యంతరాలు లేవని, అయితే బీజేపీ, ఆ పార్టీ మద్దతుదారులు హింస, విధ్వంసం, లూటీలకు పాల్పడ్డారని తప్పుపట్టారు. ఆస్తులకు నిప్పులు పెట్టారని, ప్రజల్లో భయాందోళనలు సృష్టించారని అన్నారు. ఇలాంటి వాటిని తాము సహించేది లేదని అన్నారు. హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని మమతా బెనర్జీ చెప్పారు.

Updated Date - 2022-09-15T00:39:27+05:30 IST