పోలీస్‌ సంక్షేమమే ధ్యేయం

ABN , First Publish Date - 2021-05-09T06:23:31+05:30 IST

కరోనా విజృంభిస్తున్న సమ యంలో పోలీసులు, వారి కుటుంబాలను దృష్టిలో ఉం చుకొని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ప్రత్యేక ప్రణాళిక రూపొం దించారు.

పోలీస్‌ సంక్షేమమే ధ్యేయం
పోలీస్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌


 స్వయం ఆరోగ్య సంఘాల ఏర్పాటు

 సిబ్బందిని  పరామర్శించిన ఎస్పీ

ఒంగోలు(క్రైం), మే 8: కరోనా విజృంభిస్తున్న సమ యంలో పోలీసులు, వారి కుటుంబాలను దృష్టిలో ఉం చుకొని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ప్రత్యేక ప్రణాళిక రూపొం దించారు. పోలీసు కుటుంబాలతో స్వయం ఆరోగ్య సం ఘాలను ఏర్పాటుచేశారు. దీంతో ఒకరికొకరు సహకారం అందించుకునే విధంగా చర్యలు చేపట్టారు. శనివారం  పోలీస్‌  కుటుంబాలను కలిసి వారి ఆరోగ్య పరిస్థితు ల ను అడిగి తెలుసుకున్నారు. స్థానిక క్లౌపేటలో నివా సం ఉంటున్న ఒంగోలు వన్‌టౌన్‌లో కానిస్టేబుల్‌గా పని చే స్తున్న కె.శ్రీను, తాలుకా పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సై పి.ర మేష్‌ నివాసాలకు వెళ్లి వారి కుటుంబాల ఆరోగ్య పరి స్థితులను వాకబు చేశారు. అనంతరం స్థానిక పోలీస్‌ క ల్యాణ మండపంలో పోలీస్‌ కుటుంబాలతో ఏర్పా టు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో పనిచేస్తున్న 3,600మంది సిబ్బంది ఆరోగ్య పరిస్థితులను పర్య వేక్షించడానికి 14మంది డీఎస్పీలను నోడల్‌ అధికారులుగా  నియమించినట్లు  ఎస్పీ తెలిపారు. జిల్లాలో 159 మంది పోలీసుల కుటుంబసభ్యులు కరోనా బారిన పడ్డారని తెలిపారు. వారిలో 9 మంది పరిస్థితి ఆందోళన కరంగా ఉందన్నారు.  పోలీసు కుటుంబసభ్యులతో స్వయం ఆరోగ్య సంఘాలను ఏర్పాటుచేసి నిరంతరం పర్యవేక్షణ ఉండే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఒంగోలు డీఎస్పీ  ప్రసాద్‌, సీఐలు సీతారామయ్య, శివరామకృష్ణారెడ్డి, రాజేష్‌, ఎస్‌బీ సీఐ సూర్యనారాయణ, కమాండ్‌ కంట్రోల్‌ సీఐ రాంబాబు ఉన్నారు.

కుటుంబాల పరిరక్షణ బాధ్యత పోలీసులదే  : డీఎస్పీ శ్రీకాంత్‌

ఇంకొల్లు : పోలీసులు ప్రజల రక్షణతో పాటు వారి కుటుంబాల పరి రక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చీరాల డీఎస్పీ పి.శ్రీకాంత్‌ అన్నారు. శని వారం స్థానిక శుభమస్తు పంక్షన్‌హాల్‌లో  పోలీసు కుటుంబాలకు దశ సూ త్రాలపై అవగాహన కల్పించారు. సీఐ అల్తాఫ్‌హుస్సైన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్య క్రమంలో ఇంకొల్లు, చిన గంజాం, పర్చూరు స్టేషన్ల సిబ్బంది వారి కుటుంబ స భ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఎస్పీ కౌశల్‌ సూచన మేరకు పోలీసుల కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పిస్తు న్నట్లు తెలిపారు. పోలీసు కుటుంబాల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంట నే వైద్యుని సంప్రదించాలన్నారు. ప్రతిరోజు మెడిటేషన్‌, వ్యాయామం చేయా లన్నారు. మే, జూన్‌లో పోలీసులు పూర్తిగా ప్రజల రక్షణ కోసమే పరిమితం కావాల్సి ఉందన్నారు. అందుకు వారి కుటుంబ సభ్యులు కూడా సహకరిం చాల న్నారు. బయటకు వచ్చే క్రమంలో ప్రతి ఒక్కరూ మాస్కులు వాడాలని శాని టైజర్‌ను వినియోగించాలన్నారు. కొవిడ్‌ నిబంధనలు విధిగా అమలు జేయాలన్నారు.

కరోనాపై అప్రమత్తం : డీఎస్పీ ప్రసాద్‌

పామూరు : కరోనా పట్ల పోలీసులు, వారి కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని ఇన్‌చార్జి డీఎస్పీ ప్రసాద్‌ సూచించారు. స్థానిక అనిల్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాలులో పామూరు సర్కిల్‌ పరిధిలోని పోలీసు కుటుంబాల సభ్యులకు శనివారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.  పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సీఐ కొండవీటి శ్రీనివాసరావు, ఎస్‌ఐ అంబటి చంద్రశేఖర్‌ యాదవ్‌, డాక్టర్లు రాజశేఖర్‌, పద్మసాయి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. 

జాగ్రత్తలు తీసుకోవాలి  : డీఎస్పీ రమణ 

ముండ్లమూరు : కరోనా వైరెస్‌ సెకెండ్‌ వేవ్‌ రోజురోజుకు ప్రబలుతుండటంతో పోలీసు కుటుంబాలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఒంగోలు డీసీఆర్‌బీ డీఎస్పీ ఏవీ రమణ అన్నారు. ముండ్లమూరు పోలీసు స్టేషన్‌ను ఆ యన సందర్శించారు. ముందుగా కానిస్టేబుల్‌ ప్రేమానందం ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కరోనాను అరికట్టేందుకు  జాగ్రత్త లు తీసుకోవాలన్నా రు. అనంతరం పోలీసు స్టేషన్‌ లో సిబ్బందితో సమావేశమయ్యారు. మం డలం లో కర్ఫ్యూ సమయంలో ప్రజలు ఇళ్లల్లో నుంచి బ యటకు రాకుండా చూడాలన్నారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ జి. వెంకట సైదులు, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-05-09T06:23:31+05:30 IST