Police enquiry: హరిత ఆత్మహత్య కేసులో రికవరీ ఏజెంట్ల అరెస్టు

ABN , First Publish Date - 2022-08-01T18:36:55+05:30 IST

Vijayawada: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సంచలనం సృష్టించిన విద్యార్థిని హరిత ఆత్మహత్య కేసులో ఎస్ఎల్‌వీ ఫైనాన్షియల్ సర్వీస్ ఏజెన్సీకి చెందిన ఏడుగురు

Police enquiry: హరిత ఆత్మహత్య కేసులో రికవరీ ఏజెంట్ల అరెస్టు

Vijayawada: ఎన్టీఆర్ జిల్లా నందిగామ (Nandigama)లో సంచలనం సృష్టించిన విద్యార్థిని హరిత ఆత్మహత్య(Suicide) కేసులో ఎస్ఎల్‌వీ ఫైనాన్షియల్ సర్వీస్ (Financial Service) ఏజెన్సీకి చెందిన ఏడుగురు ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేశారు. నందిగామ ఏసీపీ నాగేశ్వరరెడ్డి సమక్షంలో వత్సవాయి పోలీసు స్టేషన్లో ఏజెన్సీ మేనేజర్లు చలువ మున్నేధర్ రెడ్డి, సింగిరెడ్డి వెంకటేశ్వరావు , బూరుగు మాధురి, రికవరీ ఏజెంట్లు చిర్రా పవన్ కుమార్, కురుషోటి భాగ్యతేజ ,చల్లా శ్రీనివాసరావు , గజ్జలకొండ వెంకట శివ నాగరాజును విచారించారు. హరిత కుటుంబ సభ్యులను అవమానపరిచామని చిర్రా పవన్ , కురుషోటి భాగ్యతేజ అలియాస్ సాయి  విచారణలో అంగీకరించారు. విజయవాడ (Vijayawada) మొగల్రాజాపురంలోని ఓ బిల్డింగ్‌లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి హైదరాబాద్ బేగంపేట కేంద్రంగా ఈ ఏజెన్సీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. బేగంపేట ఏజెన్సీ మేనేజర్ బూరుగు మాధురిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. 

Updated Date - 2022-08-01T18:36:55+05:30 IST