శోభనం రోజే షాకింగ్ ఘటన.. అర్ధరాత్రి పోలీసులు గదిలోకి వచ్చి అడిగిన ప్రశ్నలకు ఆ వధువు మైండ్‌బ్లాక్..!

ABN , First Publish Date - 2022-02-11T21:04:33+05:30 IST

అమ్మాయి, అబ్బాయి ఒకొరినొకరు ఇష్టపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు వారికి పెళ్లి చేశారు. వివాహానంతరం వధువు అత్తారింట్లో అడుగుపెట్టింది. కుటుంబ సభ్యులు నూతన వధూవరులను శోభనం గదిలోకి పంపిం

శోభనం రోజే షాకింగ్ ఘటన.. అర్ధరాత్రి పోలీసులు గదిలోకి వచ్చి అడిగిన ప్రశ్నలకు ఆ వధువు మైండ్‌బ్లాక్..!

ఇంటర్నెట్ డెస్క్: అమ్మాయి, అబ్బాయి ఒకొరినొకరు ఇష్టపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు వారికి పెళ్లి చేశారు. వివాహానంతరం వధువు అత్తారింట్లో అడుగుపెట్టింది. కుటుంబ సభ్యులు నూతన వధూవరులను శోభనం గదిలోకి పంపించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి అకస్మాత్తుగా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కుటుంబ సభ్యులు అడ్డుచెబుతున్నా వినకుండా బలవంతంగా శోభనం గదిలోకి ప్రవేశించారు. అనంతరం పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆ వధువు మైండ్‌బ్లాక్ అయింది. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..


బిహార్‌కు చెందిన శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి ఓ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు. రోహ్తాస్, కైమూర్ జిల్లాల్లో‌ని పోలీస్ స్టేషన్లలో అతడిపై కేసులు నమోదయ్యాయి. శ్రవణ్ కుమార్‌ను వెతికే క్రమంలో సాసారామ్ పోలీసులు అతిగా ప్రవర్తించారు. రామ్‌జీ మహతో అనే వ్యక్తి ఇంటికి అర్ధరాత్రి వేళ వెళ్లి తలుపు తట్టారు. ఎంతకూ తలుపు తీయకపోవడంతో.. పైకప్పు ద్వారా ఇంట్లోకి ప్రవేశించారు. పైకప్పు నుంచి పోలీసులు అకస్మాత్తుగా ఇంట్లోకి ప్రవేశించడంతో రామ్‌జీ కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంతేకాకుండా.. ‘ఏం జరిగింది? పైకప్పు నుంచి ఇంట్లోకి ఎందుకు ప్రవేశించాల్సి వచ్చింది?’ అని పోలీసులను ప్రశ్నించారు. అయితే.. వారి మాటలను పోలీసులు ఏ మాత్రం పట్టించుకోకుండా శ్రవణ్ కుమార్ కోసం ఇల్లంతా గాలించారు. 



కొత్తగా పెళ్లి చేసుకుని శోభనం గదిలోకి వెళ్లిన నూతన వధూవరులను కూడా పోలీసులు విడిచిపెట్టలేదు. బలవంతంగా శోభనం గదిని తెరిపించారు. అనంతరం గదిలోకి ప్రవేశించి.. వధువుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘గదిలో నీతోపాటు ఎవరున్నారు’ అని అడగడంతో వధువు ఒక్కసారిగా షాకైంది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పోలీసులు వెనక్కి తగ్గలేదు. మరింత రెచ్చిపోయారు. ఇంట్లో ఉన్న మగవారిపై చేయి చేసుకున్నారు. ఈ దృశ్యాలన్నీంటిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉన్నతాధికారులు స్పందించారు. రామ్‌జీ మహతో కుటుంబ సభ్యులు ఎంతకూ తలుపు తెరవకపోవడంతో.. శ్రవణ్ కుమార్ ఆ ఇంట్లోనే ఉన్నట్టు పోలీసులు అనుమానించినట్టు చెప్పారు. ఇదిలా ఉంటే.. గతంలో కూడా బిహార్ పోలీసులు ఇలాగే ఓవర్ యాక్షన్ చేశారు. లిక్కర్ బాటిళ్ల కోసం వెతుకుతూ నవవధువు గదిలోకి వెళ్లారు. ఈ ఘటనపై కూడా అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి.




Updated Date - 2022-02-11T21:04:33+05:30 IST