బాంబు పేలుళ్ల కేసులో దోషి ఎస్కార్ట్ ఛార్జీగా రూ.50వేలు చెల్లించాలి

ABN , First Publish Date - 2022-03-12T17:41:58+05:30 IST

ముంబై బాంబు పేలుళ్ల దోషి అతని కుమారుడి వివాహ వేడుకకు హాజరు కావడానికి పోలీసు ఎస్కార్ట్ ఛార్జీగా రూ. 50,000 చెల్లించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది...

బాంబు పేలుళ్ల కేసులో దోషి ఎస్కార్ట్ ఛార్జీగా రూ.50వేలు చెల్లించాలి

హైకోర్టు ఆదేశం...కుమారుడి పెళ్లికి హాజరయ్యేందుకు జైళ్ల శాఖ డీఐజీ అనుమతి 

ముంబై : ముంబై బాంబు పేలుళ్ల దోషి అతని కుమారుడి వివాహ వేడుకకు హాజరు కావడానికి పోలీసు ఎస్కార్ట్ ఛార్జీగా రూ. 50,000 చెల్లించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది.1993 ముంబై పేలుళ్ల దోషి రియాజ్ అహ్మద్ సిద్ధిఖీ మార్చి 12 నుంచి 19తేదీల మధ్య అతని కుమారుడి వివాహ వేడుకకు హాజరు కావాలనుకున్నాడు.ప్రస్తుతం ముంబైలోని ఎరవాడ జైలులో ఉన్న సిద్ధిఖీ అత్యవసర పెరోల్ సెలవు మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నాడు.పూణేలోని జైలు డీఐజీ జనవరి 31 వతేదీన సిద్ధిఖీ వివాహానికి హాజరు కావడానికి అనుమతిని మంజూరు చేశారు. దోషి ఎస్కార్ట్ ఖర్చులను భరించాలనే షరతుతో డీఐజీ అనుమతించారు.


అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎస్కార్ట్ చార్జీల మాఫీ కోసం జైళ్ల శాఖ డీఐజీకి సిద్ధిఖీ దరఖాస్తు సమర్పించారు.50శాతం ఎస్కార్ట్ ఖర్చులకు లోబడి కేవలం నాలుగు రోజులు మాత్రమే పెరోల్ సెలవు ఇవ్వాలని డీఐజీని సిద్ధిఖీ కోరారు.పోలీసు ఎస్కార్ట్ అంచనా వ్యయం నాలుగు రోజులకు రూ. 2,55,515 చెల్లించాలని డీఐజీ చెప్పారు.‘‘ సిద్ధిఖీకి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. దీంతో అతని ఇతర కుటుంబ సభ్యులు ఆ ఖర్చులను భరించలేరని’’ సిద్ధిఖీ న్యాయవాది ఫర్హానా షా వాదించారు.సిద్ధిఖీకి ఐదుగురు కుమారులు ఉన్నారని డీఐజీ కోర్టుకు తెలిపారు. ఇద్దరు విదేశాల్లో నివసిస్తుండగా, ముగ్గురు కుమారులు పౌల్ట్రీ వ్యాపారం, పాత వాహనాల విక్రయం, కొనుగోలు వంటి వ్యాపారాలు చేస్తున్నారు. 


ప్రధానంగా పౌల్ట్రీ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంతోనే కుటుంబ పోషణ సాగుతుందని సిద్ధిఖీ న్యాయవాది షా పేర్కొన్నారు.ఈ అంశాలను పరిశీలించిన హైకోర్టు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఎస్కార్ట్ చార్జీల కింద రూ.50వేలు చెల్లించాలని ఆదేశించింది. ప్రాసిక్యూషన్ ప్రకారం 1993 ముంబై పేలుడు కేసులో ప్రధాన కుట్రదారులతో సామీప్యతతో సిద్ధిఖీకి కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. సెప్టెంబరు 2017లో విధించిన శిక్షను పూర్తి చేశాడు.అయితే బిల్డర్ ప్రదీప్ జైన్ హత్య కేసులో సిద్ధిఖీ కూడా దోషిగా నిర్ధారించడంతో అతనికి కోర్టు జీవిత ఖైదు విధించింది. 


Updated Date - 2022-03-12T17:41:58+05:30 IST