అమరవీరులను స్మరించుకుందాం

ABN , First Publish Date - 2021-10-26T05:30:00+05:30 IST

అమరవీరులను స్మరించుకుందాం

అమరవీరులను స్మరించుకుందాం

ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ పాటిల్‌

కృష్ణాకాలనీ, అక్టోబరు 26 : శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను ఆర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకోవాలని భూపాలపల్లి ఇన్‌చార్జి ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ జి.పాటిల్‌ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేం ద్రంలోని ఏఆర్‌ పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా రక్తదానం చేశారు.  ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సహకారంతో నిర్వహించి న ఈ రక్తదాన శిబిరంలో 300 యునిట్ల రక్తం సేకరించారు. ఈ సందర్భం గా ఎస్పీ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానం అన్నారు. కర్తవ్యమే లక్ష్యంగా విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమరవీరులను స్మరించుకోవడం సామాజిక బాఽధ్యత అన్నారు. విధి నిర్వహణలో పోలీసులు అంకితభావం కనబర్చాలన్నారు. రక్తదానం చేసిన ప్రజలు, యువత, పోలీసులను ఈ సందర్భంగా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ వి.శ్రీనివాసులు, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్‌రావు, బోనాల కిషన్‌, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కె.శ్రీనివాస్‌,  భూపాలపల్లి, చిట్యాల, కాటారం సీఐలు వాసుదేవ రావు, వెంకట్‌గౌడ్‌, రంజిత్‌రావు, ఇన్‌స్పెక్టర్లు జాని నర్సింహులు, వేణు, సతీష్‌, సంతోష్‌, ఎస్సైలు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T05:30:00+05:30 IST