Viral News: తలుపు కొట్టి బంగారం, డబ్బు అందించిన పోలీసులు.. సంతోషంతో ఆశ్చర్యపోయిన మహిళ.. అసలేమైందంటే..

ABN , First Publish Date - 2022-08-06T23:35:47+05:30 IST

నాగ్‌పూర్‌కు (Nagpur) చెందిన ఆ కుటుంబానికి పోలీసులు అమితానందాన్ని కలిగించారు.

Viral News: తలుపు కొట్టి బంగారం, డబ్బు అందించిన పోలీసులు.. సంతోషంతో ఆశ్చర్యపోయిన మహిళ.. అసలేమైందంటే..

నాగ్‌పూర్‌కు (Nagpur) చెందిన ఆ కుటుంబానికి పోలీసులు అమితానందాన్ని కలిగించారు. రెండు నెలల క్రితం ఆ ఇంటి నుంచి చోరీకి గురైన విలువైన వస్తువులను తిరిగి అందించారు. దాంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జరీపట్కా ప్రాంతంలోని జానకీ కిల్వానీ అనే మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నివసిస్తోంది. జూన్‌ నెలలో ఆమె ఇంట్లో 18 తులాల బంగారం, రూ.1.25 లక్షల నగదు చోరీకి గురయ్యాయి. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


ఇది కూడా చదవండి..

Expensive Trash Bag: చెత్త వేసే ఆ బ్యాగ్ ఖరీదు ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ఎందుకంత ఖరీదంటే..


కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాఫ్తు ప్రారంభించారు. ముంబైకి చెందిన నలుగురు దొంగలు ఆ దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు తెలుసుకున్నారు. వారిని పట్టుకున్న పోలీసులు వారి నుంచి బంగారం, డబ్బును స్వాధీనం చేసుకున్నారు. జనవరి 2021 నుంచి ఈ ఏడాది జూన్ మధ్య చాలా చోట్ల దోపిడీలకు పాల్పడిన దొంగలు రూ.68 కోట్లకు పైగా విలువైన విలువైన కాజేశారని పోలీసులు గుర్తించారు. వాటన్నింటినీ స్వాధీనం చేసుకున్న పోలీసులు బాధితులకు తిరిగి ఇచ్చారు.


జానకి ఇంటికి స్వయంగా డీసీపీ సారంగ్ అవద్ శుక్రవారం వెళ్లి పోయిన వస్తువులను తిరిగి ఇచ్చారు. దీంతో జానకి ఎంతో ఆనందడింది. పోయాయనుకున్న వస్తువులు తిరిగి దొరకడంతో ఆమెకు సంతోషంతో నోటి నుంచి మాటలు రాలేదు. పోలీసుల ఎదుట కన్నీళ్లు పెట్టుకుంది. పోలీసులతో సెల్ఫీ దిగి తన ఆనందాన్ని పంచుకుంది. 

Updated Date - 2022-08-06T23:35:47+05:30 IST