తనిఖీలతో పోలీసుల హల్‌చల్‌

ABN , First Publish Date - 2022-01-21T05:26:51+05:30 IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీసుల వాహనాల తనిఖీలు ఎప్పుడైన ఏదో ఓ చోట జరిగేవి. కానీ గురువారం సాయంత్రం 5.30 గంటలకు ఏకకాలంలో ప్రధాన చౌరస్తాల్లో ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వ ర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు.

తనిఖీలతో పోలీసుల హల్‌చల్‌
కామారెడ్డిలో వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులు

ఒకేసారి ప్రధాన చౌరస్తాల్లో వాహనాల తనిఖీలు

పాల్గొన్న ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీ, సీఐలు

ఎటూ వెళ్లలేక.. బిత్తరపోయిన వాహనదారులు 

సరైన పత్రాలు లేని వాహనాల సీజ్‌

కామారెడ్డి, జనవరి 20: కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీసుల వాహనాల తనిఖీలు ఎప్పుడైన ఏదో ఓ చోట జరిగేవి. కానీ గురువారం సాయంత్రం 5.30 గంటలకు ఏకకాలంలో ప్రధాన చౌరస్తాల్లో ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వ ర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. 43 నెంబర్‌ ప్లేట్‌లేని వాహనాలు, 173 హెల్మెట్‌ లేకుండా ప్రయాణం చేసే వాహనదారులు, 101 మాస్క్‌లు లేకుండా ప్రయాణం చేసే వాహనదారులను గుర్తించి పట్టుకుని వారి వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్‌లకు తరలించా రు. మరికొంత మందికి జరిమానాలను విధించారు. జిల్లా కేంద్రంలో ఏకకాలంలో ప్రధాన చౌరస్తాల్లో వాహనాల తనిఖీ చేపట్టడం చూసి వాహనదారులు బిత్తరపోయా రు. నిజాంసాగర్‌ చౌరస్తా, పాత బస్టాండ్‌ చౌరస్తా, కొత్త బస్టాండ్‌ చౌరస్తాలతో పాటు స్టేషన్‌రోడ్డు, సిరిసిల్లా రోడ్డులలో స్పెషల్‌ పార్టీ పోలీసులతో స్వయంగా ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, ఏఎస్పీ అనోన్యల పర్యవేక్షణతో వాహనాల తనిఖీ చేపట్టారు. ముఖ్యంగా నేరాలను, రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం, కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ నియంత్రించాలనే ఉద్దేశ్యంతో ఈ వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆరుగురు ఎస్‌ఐలు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారని తెలిపారు. ప్రజలు సురక్షితంగా ఉండాలనే ఉద్దే శ్యంతోనే ఆకస్మికంగా వాహనాల తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నందున మాస్క్‌లు, శానిటైజర్‌లు వెంట పెట్టుకోవాలని వాహనదారులకు సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలన్నారు. ట్రిబుల్‌ రైడింగ్‌, అతివేగంగా వెళ్లడం వల్ల ప్రమాదాలకు గురవుతారని ఎస్పీ తెలిపారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కల్గి ఉండాలని కార్లు, ద్వి చక్ర వాహనాలను నడిపే వాహనదారులు వాహనాలకు సంబంధించిన పత్రాలను వాహనాల వెంట ఉంచుకోవాలని తెలిపారు. ట్రాఫిక్‌ నిబంధనలను పాటి ంచాలని వాహనదారులను కోరారు. నిబంధనలను ఉల్ల ంఘించి వాహనాలను నడిపితే వాహనాలను సీజ్‌ చేస్తామని తెలిపారు. వాహనదారులు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు వాహనాలకు సంబంధించిన పత్రాలతో పాటు హెల్మెట్‌లను తప్పక ధరించాలని అన్నా రు. ఈ తనిఖీలలో డీఎస్పీ సోమనాథం, పట్టణ సీఐ నరేష్‌, ఎస్‌ఐలు మధుసూదన్‌గౌడ్‌, రాములు, ఆనంద్‌ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T05:26:51+05:30 IST