పోలీసు వీక్లీ ఆఫ్‌ జాలీజాలీగా..

ABN , First Publish Date - 2021-12-03T05:20:19+05:30 IST

పోలీసుల విక్లీఆ్‌ఫను మండలకేంద్రంలో బుధవారం జాలీజాలీగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తొలుత చోళులకాలం నాటి మల్లీశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నా రు.

పోలీసు వీక్లీ ఆఫ్‌ జాలీజాలీగా..

పోలీసు సిబ్బంది కుటుంబికులతో కలిసి నృత్యం చేసిన ఎస్పీ

కళ్యాణదుర్గం సబ్‌ డివిజన పోలీసు సిబ్బందికి సామూహిక వనభోజనాలు

కంబదూరు, డిసెంబరు2: పోలీసుల విక్లీఆ్‌ఫను మండలకేంద్రంలో బుధవారం జాలీజాలీగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తొలుత చోళులకాలం నాటి మల్లీశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నా రు. ఆలయ విశిష్టత, అక్కడున్న శిల్పాలు, ఆయల చరిత్రను అర్చకులు ఎస్పీకి వివరించారు. అనంతరం అర్చకులు, గ్రామ పెద్దలు, ఎస్సీని దుశ్శాలువాలు, పూలమాలలలో ఘనంగా సత్కరించారు. అక్కడి నుంచి నేరుగా అండేపల్లి వద్ద గల రామప్పకొండలో వెలసిన శివాలయం వద్దకెళ్లారు. కళ్యాణదుర్గం డివిజన పరిధిలోని పోలీసులు, వారి కుటుంబికులకు అక్కడ వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రామప్పకొండలో పోలీసు సిబ్బంది సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో చిన్ననాటి జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఎస్పీ నృత్యం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ వీక్లీ ఆఫ్‌ తమ జీవితాల్లో వెలుగులు నింపిందన్న ఆశాభావంతోనే ఇలా ఒక్కరోజు సంతోహంగా గడిపేందుకు వనభోజనాలు ఏర్పా టు చేశామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఆంథోనప్ప, సీఐలు, ఎస్‌ఐ రాజేష్‌, వైసీపీ నాయకులు, అర్చకులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-03T05:20:19+05:30 IST