పోలీసులు చట్టాన్ని అతిక్రమించరాదు

ABN , First Publish Date - 2022-01-28T05:12:18+05:30 IST

పోలీసులు చట్టాన్ని, భారత రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేయాలిగానీ.. వాటిని అతిక్రమించరాదని టీడీపీ లీగల్‌ సెల్‌ న్యాయవాదులు బద్దెపూడి రవీంద్ర, సీహెచ్‌. శ్రీహరి నారాయణరావు, సోమిరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి హజరత్‌ పేర్కొన్నారు.

పోలీసులు చట్టాన్ని అతిక్రమించరాదు
విలేకరులతో మాట్లాడుతున్న టీడీపీ లీగల్‌ సెల్‌ న్యాయవాదులు

 టీడీపీ లీగల్‌ సెల్‌ న్యాయవాదులు  


పొదలకూరు, జనవరి 27 : పోలీసులు చట్టాన్ని, భారత రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేయాలిగానీ.. వాటిని అతిక్రమించరాదని టీడీపీ లీగల్‌ సెల్‌ న్యాయవాదులు బద్దెపూడి రవీంద్ర, సీహెచ్‌. శ్రీహరి నారాయణరావు, సోమిరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి హజరత్‌ పేర్కొన్నారు. గురువారం మాజీమంత్రి సోమిరెడ్డిపై అసభ్యకర పదజాలంతో వ్యక్తిగత దూషణలతో ప్రెస్‌మీట్‌లో మాట్లాడడం, వాట్సప్‌ గ్రూపుల్లో పోస్టు చేసిన పొదలకూరు వైసీపీ మండల నాయకులపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం రాష్ట్ర తెలుగు రైతు ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కోడూరు భాస్కర్‌రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో పోలీసులు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. వైసీపీ మండల కన్వీనర్‌ పెద్దమల్లు రమణారెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డిలపై రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇకపై టీడీపీ నాయకులు, కార్యకర్తలపై  అక్రమ కేసులు పెట్టడం, బెదిరించడం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లికార్జున్‌నాయుడు, అక్కెం సుధాకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, పి.కృష్ణయాదవ్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-28T05:12:18+05:30 IST