డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అరెస్ట్పై గోప్యత పాటిస్తున్న పోలీసులు

ABN , First Publish Date - 2022-05-23T17:56:42+05:30 IST

వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ అరెస్ట్పై పోలీసులు గోప్యత పాటిస్తున్నారు.

డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అరెస్ట్పై గోప్యత పాటిస్తున్న పోలీసులు

కాకినాడ: వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ అరెస్ట్పై పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. ఇంకా ఎమ్మెల్సీ అరెస్ట్పై పోలీసులు ఎటుంవటి ప్రకటనా చేయలేదు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ను జడ్జి ఎదుట హాజరుపరిచి.. రాజమండ్రి జైలుకు తరలించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీఎస్పీ పోలీస్ గెస్ట్హౌస్లో ఉంచారని మరో వదంతి సైతం వినిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించాలని మరో వాదన వినిపిస్తోంది. ముందు కాకినాడ జైలుకు తీసుకువచ్చి ఎంట్రీ చేయించాకే.. రాజమండ్రి జైలుకు తరలించాల్సి ఉంటుందని లాయర్లు చెబుతున్నారు.  


కాగా.. ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంది ముమ్మాటికీ హత్యేనని నిర్ధారణ అయింది. రోడ్డు ప్రమాదమంటూ ఎమ్మెల్సీ చెప్పిందంతా కట్టుకథేనని తేలిపోయింది. పోస్టుమార్టంలో నివ్వెరపరిచే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తీవ్రంగా కొట్టడంతోపాటు గొంతుమీద కాలేసి తొక్కడంతో ఊపిరాడక గుండె ఆగిపోయి సుబ్రహ్మణ్యం చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కొన్ని అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. కాకినాడ జీజీహెచ్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను ఆదివారం మధ్యాహ్నం పోలీసులకు అందించారు. 

Updated Date - 2022-05-23T17:56:42+05:30 IST