శాంతి భద్రతల పరిరక్షణకే పోలీస్‌

ABN , First Publish Date - 2021-10-27T05:22:09+05:30 IST

సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పోలీసులు పనిచేస్తున్నారని సీఐ రవికుమార్‌, ఎస్‌ఐ అవినాష్‌ అన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణకే పోలీస్‌
తుపాకీ పనితీరును విద్యార్థులకు వివరిస్తున్న సీఐ రవికుమార్‌, ఎస్‌ఐ అవినాష్‌

నల్లజర్ల, ఆక్టోబరు 26: సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పోలీసులు పనిచేస్తున్నారని సీఐ రవికుమార్‌, ఎస్‌ఐ అవినాష్‌ అన్నారు. పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం నిర్వహించారు.  పోలీస్‌స్టేషన్‌ జరిగే కార్యక్రమాలు, ఆయుధ ప్రదర్శన, పోలీసు విధులు, పనితీరు, రికార్డుల నిర్వహణ వంటి అంశాలను తెలియజేశారు. కార్యక్రమంలో సెయింట్‌ క్లారెట్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T05:22:09+05:30 IST