కడపకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు

Published: Thu, 20 Jan 2022 23:21:33 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కడపకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులుపెండ్లిమర్రిలో రాస్తారోకో చేస్తున్న ఉపాధ్యాయులు

రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేసిన ఉపాధ్యాయులు 

పెండ్లిమర్రి, జనవరి 20 : మండల కేంద్రంలోని కడప-పులివెందుల ప్రధాన రహదారిపై గురువారం ఉపాధ్యాయులు రాస్తారోకో చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల కలెక్టరేట్‌ వద్ద నిరసనకు పిలుపు మేరకు పులివెందుల, వేంపల్లెలకు చెందిన ఉపాధ్యాయులు కడపకు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ అర్ధరాత్రి ఇచ్చిన తిరోగమన పీఆర్సీ జీవోను రద్దు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయన్నారు. పోలీసులు ఉపాధ్యాయ సంఘాల నాయకులను, ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.