గుడివాడ కాసినో వ్యవహారంపై పోలీస్ విచారణ

Published: Thu, 20 Jan 2022 18:04:20 ISTfb-iconwhatsapp-icontwitter-icon
గుడివాడ కాసినో వ్యవహారంపై పోలీస్ విచారణ

కృష్ణా: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం స‌ృష్టించిన గుడివాడ కాసినో వ్యవహారంపై పోలీస్ విచారణ ప్రారంభమైంది. సంక్రాంతి పండుగ రోజుల్లో కాసినో, చీర్ గర్ల్స్ డ్యాన్స్‌లు నిర్వహణపై టీడీపీ నాయకులతో పాటు పలువురు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.  దీంతో ఈ ఘటనపై నూజివీడు డీఎస్పీ శ్రీనివాస్  విచారణ చేపట్టారు. శిబిరం నిర్వాహకుల నుంచి స్టేట్ మెంట్‌ను పోలీసులు రికార్డు చేస్తున్నారు. వివిధ చానెల్స్, సోషల్ మీడియాలో వచ్చిన కాసినో, చీర్ గర్ల్స్ డ్యాన్స్‌ల వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. స్థానికంగా ఆ రోజున అక్కడ విధుల్లో ఉన్న పోలీసుల నుంచి డీఎస్పీ వివరాలు సేకరించనున్నారు. మరో రెండు రోజులపాటు  పోలీసులు విచారణ జరపనున్నారు. ఎస్పీకి డీఎస్పీ శ్రీనివాస్ ఆదివారం నివేదిక ఇవ్వనున్నారు.  


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.