హుక్కా సెంటర్‌పై పోలీసుల దాడులు

ABN , First Publish Date - 2022-03-03T01:06:46+05:30 IST

నగరంలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గల హుక్కా సెంటర్‌పై పోలీసులు

హుక్కా సెంటర్‌పై పోలీసుల దాడులు

హైదరాబాద్: నగరంలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గల హుక్కా సెంటర్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు.  మణికొండలోని లక్ష్మీ‌నగర్ కాలనీలో స్ట్రోక్స్ కేఫ్‌లో హుక్కా సెంటర్ నడుపుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు.హుక్కా సెంటర్‌లో పనిచేసే సిబ్బంది అనిల్ కుమార్, రాజు, సందీప్ సాయికుమార్‌లను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిర్వాహకుడు సుమన్ పరారీలో ఉన్నాడు. తొమ్మిది హుక్కా పాట్స్‌తో పాటు పలు రకాల హుక్కా సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-03-03T01:06:46+05:30 IST