గుట్కా విక్రయాలపై పోలీసుల దాడులు

ABN , First Publish Date - 2021-10-24T05:51:50+05:30 IST

నగరంలో నిషేధిత గుట్కాను విక్రయిస్తున్నట్లు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో నిజామాబాద్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆదే శాల మేరకు శనివారం పలు దుకాణాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 45 కేసులు నమోదు చేసి రూ.రెండు లక్షల విలువైన తంబాకు ఉత్పత్తులను

గుట్కా విక్రయాలపై పోలీసుల దాడులు
నగరంలోని కిరాణా దుకాణాల్లో సోదాలు చేస్తున్న పోలీసులు

ఖిల్లా, అక్టోబరు 23: నగరంలో నిషేధిత గుట్కాను విక్రయిస్తున్నట్లు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో నిజామాబాద్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆదే శాల మేరకు శనివారం పలు దుకాణాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 45 కేసులు నమోదు చేసి రూ.రెండు లక్షల విలువైన తంబాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని నాల్గో, మూడో టౌన్‌ పోలీసు స్టేషన్ల పరిధుల్లో నిషేధిత గుట్కా అమ్మకాలు చేస్తున్న వారిపై శనివారం దాడులు చేశారు. కచ్చితమైన సమాచారం మేరకు ఈ దాడులు చేసినట్లు ఎస్‌ఐలు తెలిపారు. ఈ దాడుల్లో నాల్గొ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఎనిమిది మంది గుట్కా విక్రేతలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కే.సందీప్‌కుమార్‌ తెలిపారు. అదే విధంగా మూడవ టౌన్‌ పరిధిలో గుట్కా విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వారణాసి సంతోష్‌కుమార్‌ తెలిపారు. ఈ దాడుల్లో 6వ టౌన్‌ ఎస్‌ఐ ఆంజనేయులు, ఆసీఫ్‌, ఏఎస్‌ఐ రమేష్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

నిజామాబాద్‌ రూరల్‌: సీపీ కార్తికేయ ఆదేశాల మేరకు రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని పలు దుకాణాలు, పాన్‌షాపుల్లో రూరల్‌ పోలీసులు తనిఖీలు చేశారు. శనివారం రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని చంద్రశేకర్‌ కాలనీ, కంఠేశ్వర్‌ బైపాస్‌, విఠలేశ్వర్‌నగర్‌, భాగ్యనగర్‌, ఖానాపూర్‌, కాలూరు, శ్రీనగర్‌, గుండారం, తదితర గ్రామాల్లోని కిరాణా దుకాణాలు, పాన్‌షాపుల్లో తమ సిబ్బందితో తనిఖీలు చేశారు. గుట్కా, జర్దా పాకెట్లు పట్టుకున్నారు. అయితే, గంజాయి ఉన్న ఆనావాళ్లు ఎక్కడా లేవని తెలిపారు. అనుమతిలేని గుట్కా అమ్ముతున్నవారికి జరిమానాలు విధించినట్లు ఎస్‌హెచ్‌వో లింబాద్రి తెలిపారు.

జక్రాన్‌పల్లి: మండలంలోని వివిధ గ్రామాల్లో శనివారం పలు కిరాణా దుకాణాలు, పాన్‌షాప్‌లపై ఎస్సై అసీఫ్‌ ఆధ్వర్యంలో పోలీసులు దాడు నిర్వహించారు. వివిధ గ్రామాల్లో కిరాణషాప్‌, పాన్‌షాప్‌లో అక్రమంగా గుట్కా విక్రయిస్తుండగా దాడులు చేసి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై అసీఫ్‌ తెలిపారు. అక్రమంగా గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న వారిపై కేసు నమోదు చేశామన్నారు.  

మెండోర: మండలంలో కిరాణషాపుల్లో గంజాయి, గుట్కాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని ఎస్సై శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం మండలంలో పోచంపాడ్‌ గ్రామంలో గల పలు కిరాణషాపుల్లో తనిఖీలు చేశారు.   

బాల్కొండ: అక్రమంగా గుట్కా విక్రయిస్తున్నారన్న సమాచారంతో బాల్కొండ పోలీసులు శనివారం పాన్‌షాప్‌లను తనిఖీ చేశారు.  ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్సై రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు. 

ఆర్మూర్‌ టౌన్‌: ఆర్మూర్‌లోని ఎఫ్‌బీ ఫ్యాషన్‌ బట్టల దుకాణంలో సీఐ సైదేశ్వర్‌, ఎస్సై శ్రీకాంత్‌లు పక్క సమాచారం మేరకు శనివారం తనిఖీ చేసి హుక్కా పొగాకు స్వాధీనం చేసుకున్నారు. షాప్‌యజమాని మహ్మద్‌ ఉబెదుల్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. 

Updated Date - 2021-10-24T05:51:50+05:30 IST