ltrScrptTheme3

ప్రజల ప్రశాంత జీవనానికి పోలీసుల కృషి ఎనలేనిది

Oct 27 2021 @ 00:41AM
కొవ్వొత్తుల ర్యాలీ

- అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఎమ్మెల్యే, ఎస్పీ

ధర్మవరం, అక్టోబరు 26: ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అందుకు పోలీసులు సమర్థవంతమైన సేవలే కారణమని ఎమ్మెల్యేకేతి రెడ్డివెంకటరామిరెడ్డి కొనియడారు. పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం రాత్రి కళాజ్యోతి సర్కిల్‌ నుంచి ఎన్టీఆర్‌, గాంధీ సర్కిల్‌ మీదుగా ఎమ్మెల్యే, ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప, డీఎస్పీ రమాకాంత్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ సాయికుమార్‌, నాయకులు, విద్యార్థులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..పోలీస్‌ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులందరూ తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి దేశ, ప్రజల భద్రత కోసం కృషిచేయడం అభినందనీయమన్నారు. ఎస్పీ మాట్లాడుతూ...నేటి విద్యార్థులతోపాటు యువత కూడా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతూ దేశభక్తిని పెంపొందించుకో వాలన్నారు. పోలీసు వ్యవస్థ ప్రజల న్యాయం కోసం అంకితభావంతో  పనిచేస్తామ న్నారు. సమాజ సంరక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల ఆశయా లను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. అనంతరం నాట్యకళా నికేతన్‌ కళాబృందం, విద్యార్థులు నిర్వహించిన కూచిపూడి, నృత్యం పలు సాంస్కృ తిక కార్యక్రమాలను పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమి షనర్‌ మల్లికార్జున, తహసీల్దార్‌ నీలకంఠారెడ్డి, అడిషనల్‌ ఎస్పీ నాగేంద్రుడు, స్వచ్ఛంద సంస్థలు,  ప్రైవేటు కళాశాల విద్యార్థులు, కౌన్సిలర్‌లు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.