ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండాలి

ABN , First Publish Date - 2021-01-24T05:09:35+05:30 IST

ప్రజలకు పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి భద్రత, రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఇన్‌చార్జీ ఎస్పీ విష్ణు వారి యర్‌ ఉపదేశించారు.

ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండాలి
క్యాలండర్‌ విడుదల చేస్తున్న ఇన్‌చార్జీ ఎస్పీ విష్ణు వారియర్‌

ఇన్‌చార్జీ ఎస్పీ విష్ణు వారియర్‌

నిర్మల్‌ కల్చరల్‌, జనవరి 23 : ప్రజలకు పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి భద్రత, రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఇన్‌చార్జీ ఎస్పీ విష్ణు వారి యర్‌ ఉపదేశించారు. శనివారం ఆయన పోలీస్‌శాఖ వార్షిక క్యాలెండర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ మహిళల రక్షణ కోసం షీ టీం బృందాలు మరింత పకడ్బందీగా విధులు నిర్వర్తించాలన్నారు. ట్రాఫి క్‌ నియంత్రణలో అప్రమత్తంగా ఉండి ప్రమాదాలు జరుగకుండా చూడాలన్నారు. ప్రభుత్వ శాఖలతో సమన్వ యంగా పని చేయాలని ఆదేశించారు. ఆర్థిక నేరాల నియంత్రణకు రాత్రిపూట పెట్రోలింగ్‌ వాహనాలు పటిష్ట గస్తీ నిర్వహించాలని, జాతీయ రహదారిపై నిఘా పెంచాలన్నారు. సీసీ కెమెరాల ఆవశ్యకత ప్రజలకు వివరించి ప్రోత్సహించాలన్నారు. ఏఎస్పీ రాంరెడ్డి, ఎస్‌బీ ఇన్స్‌పెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, పోలీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విరాసత్‌ అలీ, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-24T05:09:35+05:30 IST