పోలీసులు ఆరోగ్యంగా ఉండాలి

Published: Tue, 09 Aug 2022 23:27:36 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పోలీసులు ఆరోగ్యంగా ఉండాలి వైద్యశిబిరం సందర్భంగా మాట్లాడుతున్న సీఐ రమేష్‌బాబు

పోరుమామిళ్ల, ఆగస్టు 9 : పోలీసులు ఆరోగ్యంగా ఉం డాలని సీఐ రమేష్‌బాబు, ఎస్‌ఐ హరిప్రసాద్‌ అన్నారు. మంగళవారం పోరుమామిళ్ల కలసపాడు, కాశినాయన, మండలాల్లోని పోలీసు కు టుంబాలకు స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో మెడికల్‌ క్యాంప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  విశ్రాంతి లేకుండా పని చేయాల్సి రావడంతో పోలీసు సిబ్బంది ఒత్తిడికి గురవుతున్నా రన్నారు. దీంతో ఆరోగ్య సమస్యలు ఎదురవుతుండడంతో ఎస్పీ అన్బురాజన్‌ మెడికల్‌ క్యాంప్‌లు నిర్వహించాలని ఆదేశించారన్నారు. ఈ శిబిరంలో బీపీ,  షుగర్‌, కొలెస్ర్టాల్‌,  ఈసీజీ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో ఏఎస్‌ఐలు కాశయ్య, రాజశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ మధుసూదన్‌రాజు, స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.