పోలీసులకు చిక్కిన 4.3 టన్నుల కొకైన్.. ఎక్కడంటే

ABN , First Publish Date - 2021-07-20T07:47:35+05:30 IST

అమెరికాలోని కోస్టారికాలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. కొలంబియా నుంచి ఈ డ్రగ్స్‌ను తీసుకొచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు.

పోలీసులకు చిక్కిన 4.3 టన్నుల కొకైన్.. ఎక్కడంటే

కోస్టారికా: అమెరికాలోని కోస్టారికాలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. కొలంబియా నుంచి ఈ డ్రగ్స్‌ను తీసుకొచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. కోస్టారికాలో ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ దొరికిపోవడం ఇది రెండోసారి. కోస్టారికా పోలీసులు ఆదివారం నాడు 4.3 టన్నుల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సెరామిక్ టైల్ ఫ్లోరింగ్‌లో ఈ కొకైన్‌ను స్మగ్లింగ్ చేయడానికి స్మగ్లర్లు ప్రయత్నించారు. ఒక కమర్షియల్ నౌకలో వీటిని కోస్టారికాకు తరలించారని కోస్టారికా రక్షణ శాఖ వెల్లడించింది. ఈ నౌక కోస్టారికాలోని మోయిన్ ఓడరేవుకు చేరుకున్నప్పుడు అధికారులు ఈ డ్రగ్స్‌ను పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తర అమెరికాలోని ఈ దేశం బీచులు, అగ్నిపర్వతాలకు పేరొందింది. ఇక్కడ ఇలా భారీ స్థాయిలో డ్రగ్స్ దొరకడం ఇది రెండోసారని అధికారులు తెలిపారు.

Updated Date - 2021-07-20T07:47:35+05:30 IST