స్టేషన్ల.. సర్దుబాటు

Published: Sun, 26 Jun 2022 00:14:18 ISTfb-iconwhatsapp-icontwitter-icon
స్టేషన్ల.. సర్దుబాటునరసరావుపేట జిల్లా పోలీసు కార్యాలయం

కొత్త జిల్లాలతో మారిన పోలీసు స్టేషన్ల స్వరూపం

పలు పోలీస్‌స్టేషన్ల నవీకరణ

మరికొన్ని సర్కిల్స్‌, సబ్‌ డివిజన్లలో మార్పులు

నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం


గుంటూరు, జూన్‌ 25: కొత్త జిల్లాల ఏర్పాటుతో పోలీసు స్టేషన్ల స్వరూపంలోనూ మార్పులు వచ్చాయి. పోలీస్‌స్టేషన్ల సామర్ధ్యాన్ని బట్టి కొన్నింటిని(అప్‌గ్రడేషన్‌) నవీకరించారు. మరికొన్ని సర్కిల్స్‌, సబ్‌ డివిజన్లలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని స్టేషన్లను వేరే సర్కిల్‌లోకి, అలాగే కొన్ని సర్కిల్స్‌ను మరో డివిజన్‌లోకి చేరుస్తూ ప్రభుత్వం విధి విధానాలతో రూపొందించిన నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అప్‌గ్రేడ్‌ అయిన పోలీస్‌స్టేషన్లకు ఎస్‌హెచ్‌వోలుగా సీఐలను నియమిస్తారు. మిగిలిన పోలీస్‌స్టేషన్లకు ఎస్‌హెచ్‌వోలుగా ఎస్‌ఐలు కొనసాగుతారు. సర్కిల్‌ స్టేషన్లకు సీఐలను నియమిస్తారు. జిల్లాల వారీగా ఆయా పోలీస్‌స్టేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.. 


గుంటూరు జిల్లాలో..

ఈస్టు సబ్‌ డివిజన్‌ పరిధిలో లాలాపేట, కొత్తపేట, పాతగుంటూరు, అలాగే వెస్టు సబ్‌ డివిజన్‌ పరిధిలో అరండల్‌పేట, పట్టాభిపురం, నగరంపాలెం స్టేషన్లు గతంలోలాగే యదావిధిగా అప్‌గ్రేడ్‌ అయి ఉన్నాయి. నార్త్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని పెదకాకాని, మంగళగిరి టౌన్‌, తాడేపల్లి పోలీస్‌స్టేషన్లు అప్‌గ్రేడ్‌ అయ్యాయి. అలాగే మంగళగిరి రూరల్‌ సర్కిల్‌ పరిధిలోకి మంగళగిరి రూరల్‌, దుగ్గిరాల స్టేషన్లను చేర్చారు. అదేవిధంగా సౌత్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో నల్లపాడు పోలీస్‌స్టేషన్‌ అప్‌గ్రేడ్‌ చేశారు. ప్రత్తిపాడు సర్కిల్‌లోకి ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు, కాకుమాను స్టేషన్లను చేర్చారు.  తుళ్లూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌, తుళ్లూరు ట్రాఫిక్‌ స్టేషన్‌, తాడికొండ, మేడికొండూరు స్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేశారు. ఫిరంగిపురం స్టేషన్‌ను మేడికొండూరు పరిధిలోకి చేర్చారు. అలాగే తెనాలి సబ్‌ డివిజన్‌ పరిధిలో పొన్నూరు టౌన్‌, తెనాలి వన్‌టౌన్‌, టూటౌన్‌ త్రీ టౌన్‌ స్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేశారు. పొన్నూరు రూరల్‌ పరిధిలోకి పొన్నూరు రూరల్‌, చేబ్రోలు స్టేషన్లను చేర్చారు. తెనాలి రూరల్‌ సర్కిల్‌ పరిధిలోకి తెనాలి రూరల్‌, కొల్లిపర స్టేషన్లను చేర్చారు. వీటితోపాటు గుంటూరులోని ట్రాఫిక్‌ స్టేషన్‌, దిశ స్టేషన్‌, సీసీఎస్‌ స్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేశారు. 


 బాపట్ల జిల్లా...

రేపల్లె సబ్‌ డివిజన్‌ పరిధిలోని రేపల్లె టౌన్‌ స్టేషన్‌ను మాత్రమే అప్‌గ్రేడ్‌ చేశారు. రేపల్లె రూరల్‌ సర్కిల్‌ పరిధిలోకి చెరుకుపల్లి, నగరం నిజంపట్నం, అడవులదీవి, చౌడాయపాలెం స్టేషన్లను చేర్చారు. అలాగే చుండూరు లేదా వేమూరును సర్కిల్‌గా చేసుకోవచ్చని ఉన్నతాధికారులు సూచించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆ రెండింటిలో ఏదో ఒక స్టేషన్‌ను సర్కిల్‌గా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ సర్కిల్‌ పరిధిలోకి భట్టిప్రోలు, కొల్లూరు, వేమూరు, చుండూరు స్టేషన్లను చేర్చారు. బాపట్ల సబ్‌ డివిజన్‌ పరిధిలో బాపట్ల టౌన్‌  మాత్రమే అప్‌గ్రేడ్‌ చేశారు. బాపట్ల రూరల్‌ సర్కిల్‌ పరిధిలోకి బాపట్ల రూరల్‌, కర్లపాలెం, చందోలు, వెదుళ్లపల్లి స్టేషన్లను చేర్చారు. మార్టూరు సర్కిల్‌ పరిధిలోకి పర్చూరు. మార్టూరు, యద్దనపూడి స్టేషన్లను చేర్చారు. సంతమాగులూరు సర్కిల్‌ పరిధిలోకి సంతమాగులూరు, బల్లికురవ స్టేషన్లను చేర్చారు. చీరాల సబ్‌ డివిజన్‌ పరిధిలో చీరాల వన్‌టౌన్‌, టూటౌన్‌, అద్దంకి పోలీస్‌స్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేశారు. చీరాల రూరల్‌ స్టేషన్‌ పరిధిలోకి ఈపూరుపాలెం, వేటపాలెం స్టేషన్లను, ఇంకొల్లు సర్కిల్‌ పరిధిలోకి కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం స్టేషన్లను చేర్చారు. అద్దంకి రూరల్‌ సర్కిల్‌ పరిధిలోకి మేదరమెట్ల, కొరిసెపాడు, జె పంగులూరు స్టేషన్లను చేర్చారు. 


పల్నాడు జిల్లా...

పల్నాడు జిల్లా గురజాల సబ్‌ డివిజన్‌ పరిధిలో గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల పోలీస్‌స్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేశారు. మాచవరం స్టేషన్‌ను దాచేపల్లి పరిధిలోకి చేర్చారు. కారంపూడి సర్కిల్‌ పరిధిలోకి కారపూడి, రెంటచింతల, దుర్గి స్టేషన్లను చేర్చారు. మాచర్ల  రూరల్‌ సర్కిల్‌ పరిధిలోకి మాచర్ల రూరల్‌, వెల్దుర్తి, నాగార్జునసాగర్‌ స్టేషన్లను చేర్చారు. నరసరావుపేట సబ్‌ డివిజన్‌ పరిధిలో నరసరావుపేట వన్‌టౌన్‌, టూటౌన్‌, చిలకలూరిపేట టౌన్‌, వినుకొండ స్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేశారు. నరసరావుపేట రూరల్‌ సర్కిల్‌ పరిధిలోకి నరసరావుపేట రూరల్‌, రొంపిచర్ల స్టేషన్లను చేర్చారు. చిలకలూరిపేట రూరల్‌ సర్కిల్‌ పరిధిలోకి చిలకలూరిపేట రూరల్‌, నాదెండ్ల, యడ్లపాడు స్టేషన్లను చేర్చారు. వినుకొండ రూరల్‌ సర్కిల్‌ పరిధిలోకి ఈపూరు, బండ్లమోటు, ఐనవోలు, శావల్యాపురం స్టేషన్లను చేర్చారు. సత్తెనపల్లి సబ్‌ డివిజన్‌ పరిధిలో అమరావతి, సత్తెనపల్లి, స్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేశారు. సత్తెనపల్లి రూరల్‌ సర్కిల్‌ పరిధిలోకి రాజుపాలెం, నకరికల్లు, సత్తెనపల్లి రూరల్‌, ముప్పాళ్ల స్టేషన్లను చేర్చారు. పెదకూరపాడు సర్కిల్‌ పరిధిలోకి బెల్లంకొండ, అచ్చంపేట, క్రోసూరు, పెదకూరపాడు స్టేషన్లను చేర్చారు. పల్నాడు జిల్లాలోని దిశ, స్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేశారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.