Instagram Reel తెచ్చిన తంటా.. సరదాగా ఫ్రెండ్స్‌తో కలిసి వీడియో చేస్తే దూల తీర్చేసిన పోలీసులు..!

Published: Thu, 30 Jun 2022 18:54:59 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Instagram Reel తెచ్చిన తంటా.. సరదాగా ఫ్రెండ్స్‌తో కలిసి వీడియో చేస్తే దూల తీర్చేసిన పోలీసులు..!

సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనే ఉద్దేశంతో యువకులు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం తదితర వేదికల ద్వారా వివిధ వీడియోలను షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు తక్కువ కాల వ్యవధిలోనే ఫేమస్ అయితే.. మరికొందరి ప్రయత్నాలు ఆదిలోనే బెడిసికొడుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కొందరు యువకులు కలిసి సరదాగా వీడియో తీసుకున్నారు. Instagram Reelలో షేర్ చేయడంతో చివరకు పోలీసుల దృష్టికి వెళ్లింది.

కేరళలోని ఇడుక్కి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు కలిసి Instagramలో వీడియోలు చేస్తుంటారు. ఈ క్రమంలో వినూత్నంగా వీడియోలు చేసి, ఫేమస్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఐదుగురు యువకులు కలిసి ఒకే స్కూటర్‌పై ఒకరి వెనుక ఒకరు కూర్చుని.. డ్యాన్స్ చేస్తూ ప్రమాదకర స్థితిలో డ్రైవింగ్ చేశారు. అనంతరం వీడియోను Instagram ఖాతాలో షేర్ చేశారు. వీడియో వైరల్ అవడంతో పోలీసుల వరకు వెళ్లింది. వారిలో ముగ్గురు యువకుల లైసెన్స్‌ను 3నెలల పాటు సస్పెండ్ చేసి, రూ.2,000 జరిమానా విధించారు. అలాగే మెడికల్ కళాశాలలో రెండు రోజుల పాటు సామాజిక సేవ చేయాలని ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

విమానం ఎక్కాక షాకింగ్ ట్విస్ట్.. బ్యాగ్‌ను చెక్ చేయాలన్న సిబ్బంది.. బయపడుతూనే ఆ యువతి వెళ్తే..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

పెరుగు తేవడానికి వెళ్లిన భర్త.. ఇంటికి చేరుకునేలోపు లోపలి నుంచి కటింగ్ మిషన్ శబ్ధాలు.. తీరా కిటికీ తలుపు తీసి చూస్తే..భర్త చనిపోయిన నెల తర్వాత.. ఓ భార్య షాకింగ్ నిర్ణయం.. నా కూతుర్ని నువ్వే చూసుకో అంటూ లేఖలో తల్లికి రాసి మరీ..ఐదో అంతస్తు ఎక్కి.. చిట్టచివరన కూర్చుని దూకేస్తానంటూ భార్య బెదిరింపులు.. పోలీసులు వచ్చి కారణం అడిగితే ఆమె చెప్పింది విని..Viral Video: నన్ను చూడడం ఆపండి... అంటున్న బుల్లి ఉడత.. ఇంతకీ అది ఏం చేసిందో మీరే చూడండి..videoకడుపునొప్పి అని కూతుర్ని ఆస్పత్రికి తీసుకెళ్తే గర్భవతి అని చెప్పిన డాక్టర్లు.. ఏం జరిగిందని ఆ తల్లి ఏడుస్తూ అడిగితే..Viral Video: ఈ పిల్ల ఏనుగుకు అతనంటే ఎంత ప్రేమ.. కీపర్‌ను చూడగానే ఏం చేసిందో చూడండి..video
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.