Police Warning: తాజా ఘటనను ఉదహరిస్తూ తల్లిదండ్రులకు పోలీసుల వార్నింగ్.. పిల్లలతో బయటికెళ్లినప్పుడు అలా చేస్తే..

ABN , First Publish Date - 2022-08-22T17:14:42+05:30 IST

పిల్లలతో బయటికెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు పోలీసులు సూచిస్తున్నారు. లేదంటే జైలు శిక్షతోపాటు జరిమానా తప్పదని హెచ్చరించారు(Police Warns Parents). పిల్లల భద్రతే తల్లిదండ్రుల ప్రధాన విధి అని ఈ సందర్భంగా పోలీసు

Police Warning: తాజా ఘటనను ఉదహరిస్తూ తల్లిదండ్రులకు పోలీసుల వార్నింగ్..  పిల్లలతో బయటికెళ్లినప్పుడు అలా చేస్తే..

ఎన్నారై డెస్క్: పిల్లలతో బయటికెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు పోలీసులు సూచిస్తున్నారు. లేదంటే జైలు శిక్షతోపాటు జరిమానా తప్పదని హెచ్చరించారు(Police Warns Parents). పిల్లల భద్రతే తల్లిదండ్రుల ప్రధాన విధి అని ఈ సందర్భంగా పోలీసులు గుర్తు చేస్తున్నారు. కాగా.. ఇంతకూ ఏమైంది? పిల్లల విషయంలో పోలీసులు తల్లిదండ్రులకు ఎందుకు సలహాలు ఇస్తున్నారనే పూర్తి వివరాల్లోకి వెళితే..


యూఏఈ(UAE)లో తాజాగా ఓ తండ్రి.. తన బిడ్డను తీసుకొని కారులో బయటకు వెళ్లాడు. ఈ క్రమంలోనే అతడికి ముఖ్యమైన కాల్ వచ్చింది. దీంతో వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశాడు. అనంతరం తన బిడ్డను కారులోనే ఉంచి.. తను మాత్రం కిందకు దిగాడు. ఫోన్ మాట్లాడుతూ.. కారుకు లాక్ వేసేశాడు. ఫోన్ మాట్లాడిన అనంతరం.. తిరిగి కారు వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో కారులో అపస్మారక స్థితిలో ఉన్న తన బిడ్డను గమనించి కంగారుపడ్డాడు. కారు డోర్ ఓపెన్ చేసి చూశాడు. అయితే.. అప్పటికే ఆ చిన్నారి మరణించడంతో శోకసంద్రంలో మునిగిపోయాడు. ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయింది.



ఈ నేపథ్యంలో తాజా ఘటనను ఉదహరిస్తూ అబుధాబి ట్రాఫిక్ పోలీసులు(Abu dhabi Traffic Police) తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. పిల్లలపాటు కారులో బయటికి వెళ్లినప్పుడు.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పిల్లలను లోపలే ఉంచి కారుకు అస్సలు లాక్ వేయవద్దని తెలిపారు. ఉష్ణోగ్రతలో మార్పుల వల్ల కారు లోపల వేడి వాతావరణం ఏర్పడి.. ఊపిరాడక పిల్లలు చనిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. మరికొన్ని సందర్భాల్లో ఇతర ప్రమాదాలు కూడా  చోటు చేసుకునే అవకాశాలూ ఉన్నాయన్నారు. అంతేకాకుండా.. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఇలా నిర్లక్ష్యం వహిస్తూ పట్టుబడితే.. 5 దిర్హమ్‌ల (సుమారు రూ.1.08లక్షల)ఫైన్(Fine) కట్టడంతోపాటు జైలు కూడా వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. 


Updated Date - 2022-08-22T17:14:42+05:30 IST