భర్త అనుమానాస్పద మృతి.. ఇంట్లో దొరికిందో పగిలిపోయిన ఫోన్.. రిపేర్ చేయించాక చెక్ చేసిన పోలీసులకు..

ABN , First Publish Date - 2022-01-27T00:13:13+05:30 IST

ఆ దంపతులిద్దరూ కిరాణా దుకాణం నడుపుకొంటూ అన్యోన్యంగా జీవించేవారు. భర్తలేని సమయంలో దుకాణాన్ని భార్యే చూసుకునేది. ఇలా సాగుతున్న వారి జీవితంలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి భర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు...

భర్త అనుమానాస్పద మృతి.. ఇంట్లో దొరికిందో పగిలిపోయిన ఫోన్.. రిపేర్ చేయించాక చెక్ చేసిన పోలీసులకు..

ఆ దంపతులిద్దరూ కిరాణా దుకాణం నడుపుకొంటూ అన్యోన్యంగా జీవించేవారు. భర్తలేని సమయంలో దుకాణాన్ని భార్యే చూసుకునేది. ఇలా సాగుతున్న వారి జీవితంలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి భర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లో పగిలిపోయిన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రిపేర్ చేయించాక చెక్ చేసి, అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో సుథాలియా పోలీస్ స్టేషన్‌ పరిధిలోని బెరియాఖేడి గ్రామంలో దినేష్ మీనా(30), జ్యోతి దంపతులు నివాసం ఉంటున్నారు. కిరాణ దుకాణం నడుపుకొంటూ జీవనం సాగిస్తుండేవారు. భర్త పని మీద బయటికి వెళ్లే క్రమంలో జ్యోతి ఒక్కటే దుకాణం చూసుకుంటూ ఉండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన చైన్‌సింగ్ లోధా అనే యువకుడు.. దుకాణానికి వస్తూ ఉండేవాడు. దినేష్ లేని సమయంలో జ్యోతితో సన్నిహితంగా మాట్లాడుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ప్రియుడు కొనిచ్చిన సెల్ ఫోన్‌లో తరచూ మాట్లాడుతూ ఉండేది. ఓ రోజు దినేష్‌కు అనుమానం వచ్చి, ఫోన్ పగులగొట్టి భార్యను మందలించాడు. అయితే తర్వాత ఆమెకు చైన్‌సింగ్ లోధా మరో సెల్ కొనిచ్చాడు.

ఇంటి ముందు పార్క్ చేసిన కారు చోరీ.. పోలీసుల ఎంట్రీతో షాకింగ్ ట్విస్ట్.. రాత్రిపూట కారును దొంగిలించింది ఎవరో తెలిసి..


వివాహేతర సంబంధం విషయంలో భార్యాభర్తలకు తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నారు. జనవరి 21న రాత్రి రోజూ మాదిరే దినేష్ భోజనం చేసి పడుకున్నాడు. తర్వాత జ్యోతి తన ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. ఇద్దరూ కలిసి దినేష్‌ను దారుణంగా హత్య చేశారు. అనంతరం రక్తపు మరకలను తుడిచేశారు. వేకువజామున ప్రియుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తన భర్తను ఎవరో హత్య చేశారంటూ జ్యోతి ఏడుపులు మొదలెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంట్లో పగిలిపోయిన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రిపేరు చేయించిన అనంతరం అందులో చెక్ చేయగా.. అసలు విషయం బయటపడింది. దీంతో జ్యోతి, చైన్‌సింగ్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.

పెళ్లయిన నాలుగు నెలలకే భార్యకు పెద్ద పెద్ద కోరికలు.. వాటిని తీర్చలేక ఆ భర్త తీసుకున్న నిర్ణయం..

Updated Date - 2022-01-27T00:13:13+05:30 IST