వైసీపీ సెక్షన్‌లతో పనిచేస్తున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-11-27T06:15:38+05:30 IST

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఐపీసీ సెక్షన్‌లు మరిచి, వైసీపీ సెక్షన్‌లతో పనిచేస్తు న్నారని తెలుగు మహిళలు విమర్శించారు. తెలుగుదేశం పా ర్టీ శ్రేణులపై అక్రమ కేసులు, నిర్భంధాలు పోలీసుల విధులు గా మారాయని ఆరోపించారు.

వైసీపీ సెక్షన్‌లతో పనిచేస్తున్న పోలీసులు
సమావేశంలో మాట్లాడుతున్న తెలుగు మహిళలు

తెలుగు మహిళల విమర్శలు


ఒంగోలు(కార్పొరేషన్‌), నవంబరు 26 : రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఐపీసీ సెక్షన్‌లు మరిచి, వైసీపీ సెక్షన్‌లతో పనిచేస్తు న్నారని తెలుగు మహిళలు విమర్శించారు. తెలుగుదేశం పా ర్టీ శ్రేణులపై అక్రమ కేసులు, నిర్భంధాలు పోలీసుల విధులు గా మారాయని ఆరోపించారు. శుక్రవారం ఒంగోలులోని టీ డీపీ కార్యాయలంలో ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షురాలు రా వుల పద్మజ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో అనంతపురం ఘటనపై మాట్లాడారు. అసెంబ్లీలో నా రా భువనేశ్వరిపై చేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ అ నంతపురంలో తెలుగు మహిళలు శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేపట్టారని, అయితే అక్కడి పోలీసుల వేధింపుల కారణంగా ఓ మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉందని చె ప్పారు. శాంతియుంతంగా నిరసన తెలిపే హక్కును కూడా అధికార పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని అణిచివేస్తుందని మండిపాడ్డారు. ఇప్పటికైనా పోలీసులు తమ తీరు మార్చు కోకుంటే టీడీపీ కోర్టులను ఆశ్రయించి ప్రైవేటు కేసుల ద్వారా ముద్దాయిలుగా నిలబడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం చేసేలా పాలన ఉందని వారు వి మర్శించారు. సమావేశంలో తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షు రాలు ఆర్ల వెంకటరత్నం, రాష్ట్ర కార్యదర్శి కామరాజుగడ్డ కు సుమకుమారి, నగర అధ్యక్షురాలు పసుపులేటి సునీత తది తరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-27T06:15:38+05:30 IST