
ఆమె తన కొడుకును తీసుకుని పది రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది.. భార్య లేకపోవడంతో ఒంటరిగా ఉన్న భర్త తన ప్రేయసిని నేరుగా ఇంటికి తీసుకెళ్లాడు.. ఆ విషయం గమనించిన పొరుగింటి మహిళ ఆమెకు ఫోన్ చేసి విషయం చెప్పింది.. దీంతో ఆమె వెంటనే తన పుట్టింటి నుంచి బయల్దేరి వచ్చేసింది.. అర్ధరాత్రి ఒంటి గంటకు తలుపు కొట్టి భర్తకు షాకిచ్చింది.. అనంతరం వారిద్దరినీ చితక్కొట్టేసింది.. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఈ ఘటన జరిగింది.
ఇవి కూడా చదవండి
మీరట్ జిల్లాలోని ఖేరా పోలీస్ స్టేషన్లో ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి భార్య పది రోజుల క్రితం కొడుకును తీసుకుని నోయిడాలోని పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో భార్య లేకపోవడంతో అతను తన ప్రేయసిని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ విషయం పొరుగింటి వారు గమనించారు. వెంటనే నొయిడాలో ఉన్న మహిళకు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో ఆమె హుటాహుటిన నోయిడా నుంచి బయల్దేరింది.
అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇంటికి వచ్చి తలుపు కొట్టింది. తలుపు తీసిన భర్త షాకయ్యాడు. ఇంట్లో వేరే మహిళతో ఉన్న భర్తను చూసి ఆమె ఆగ్రహానికి గురైంది. ఇద్దరినీ చితక్కొట్టింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురినీ పోలీస్ట్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఘటనపై విచారణ చేస్తున్నారు.