షాకింగ్.. మాస్క్ పెట్టుకోలేదని తూపాకీతో కాల్చిపారేశాడు..
ABN , First Publish Date - 2021-07-26T02:39:53+05:30 IST
డెమోక్రెటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో ఇటీవల ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మాస్కు పెట్టుకోని ఓ యూనివర్శిటీ స్టూడెంట్ను తుపాకీతో పోలీసు కాల్చాడు.
కిన్షాసా: డెమోక్రెటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో ఇటీవల ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మాస్కు పెట్టుకోని ఓ యూనివర్శిటీ స్టూడెంట్ను తుపాకీతో పోలీసు కాల్చాడు. మాస్కు ఎందుకు పెట్టుకోలేదంటూ సదరు విద్యార్థిని నిందితుడు తొలుత ప్రశ్నించాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తాను ప్రాజెక్టు పనిలో నిమగ్నమైపోయానని, తన జేబులోనే మాస్కు ఉందంటూ విద్యార్థి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించాడట. అయితే..అతడి నుంచి లంచం ఆశిస్తున్న పోలీసు ఈ వాగ్వివాదం కారణంగా సహనం కోల్పోయి తుపాకీతో కాల్చాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటన అనంతరం నిందితుడు పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో నిందితుడితోనే ఉన్న మరో ఇద్దరు పోలీసులను మాత్రం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వారు చెప్పారు.