
శ్రీనగర్: కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని సౌర ప్రాతంలో మంగళవారంనాడు ఒక పోలీసును అతని ఇంటివద్దే కాల్చిచంపారు. ఈ కాల్పుల్లో అతని కుమార్తె కుమార్తె తీవ్రంగా గాయపడింది. మృతి చెందిన వ్యక్తిని మాలిక్ సాహిబ్ సౌర ప్రాంతానికి చెందిన సైఫుల్లా ఖాద్రిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఖాద్రిని టార్గెట్‌గా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, ఆతనితో పాటు తీవ్రంగా గాయపడిన అతని కుమార్తెను స్కిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఖాద్రి మరణించాడని చెప్పారు. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి