పోలియో వ్యాక్సిన్‌ ప్రభావం పరిమితమే

ABN , First Publish Date - 2020-06-19T16:19:23+05:30 IST

కరోనా నిరోధానికి పోలియో వ్యాక్సిన్‌ను పరీక్షించాలనే ప్రతిపాదనపై భారతీయ శాస్త్రవేత్తలు ఆచి తూచి స్పందించారు. శాస్త్రీయ భావ న దృష్ట్యా ఇది మంచి ఆలోచనే కానీ

పోలియో వ్యాక్సిన్‌ ప్రభావం పరిమితమే

భారతీయ శాస్త్రవేత్తల అభిప్రాయం

న్యూఢిల్లీ, జూన్‌ 18: కరోనా నిరోధానికి పోలియో వ్యాక్సిన్‌ను పరీక్షించాలనే ప్రతిపాదనపై భారతీయ శాస్త్రవేత్తలు ఆచి తూచి స్పందించారు. శాస్త్రీయ భావ న దృష్ట్యా ఇది మంచి ఆలోచనే కానీ వైరస్‌ సంక్రమణను నిరోధించే క్రమంలో పోలియో వ్యాక్సిన్‌ పరిమితంగానే రక్షణనిచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.


అమెరికాలోని మేరీల్యాండ్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన శ్యామ్‌సుందరన్‌ కుట్టిలి, రాబర్ట్‌ గాల్లో గత వారం కరోనా నివారణకు పోలియో వ్యాక్సిన్‌ను పరీక్షించాలనే ప్రతిపాదన చేశా రు. దీనిపై  భారతీయ శాస్త్రవేత్తలు స్పందించారు. ప్రారంభ దశలో స్వల్ప లక్షణాలు ఉండే రోగుల విషయం లో ఈ వ్యాక్సిన్‌ ఉపయోగపడొచ్చు, కానీ వ్యాధి తీవ్రం గా ఉన్న వారి విషయంలో మాత్రం ప్రతికూల ఫలితా లు రావొచ్చని సీఎ్‌సఐఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటరాగేటివ్‌ మెడిసిన్‌ డైరెక్టర్‌ రామ్‌ విశ్వకర్మ పేర్కొన్నారు. పోలియో వ్యాక్సిన్‌ ద్వారా ఒక ప్రత్యేక రోగ నిరోధక శక్తి లభిస్తుంది అది కరోనా వైర్‌సను నివారించడానికి కొంత వరకు మాత్రమే తోడ్పడుతుందని న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యూనాలజీ (ఎన్‌ఐఐ)కు చెందిన సత్యజిత్‌ రాత్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-19T16:19:23+05:30 IST