వైభవంగా పోలిస్వర్గం

ABN , First Publish Date - 2021-12-06T05:33:30+05:30 IST

కార్తీకమాసం ముగియటంతో మహిళలు పోలిస్వర్గం వేడుకలను ఆదివారం తెల్లవారుజామున వైభవంగా జరుపుకున్నారు. ఆవు నెయ్యితో వెలిగించిన దీపాలను నీటిలో విడిచిపెట్టారు. కార్తీకమాసంలో అత్యంత భక్తితో పరమేశ్వరుడిని ఆరాధించిన ’పోలి’ అనే గృహిణికి మార్గశిర పాడ్యమి రోజు స్వర్గప్రాప్తి కలిగిందని పురాణాలు చెబుతున్నాయి.

వైభవంగా పోలిస్వర్గం
కొప్పోలు చెరువులో దీపాలు వదులుతున్న భక్తులు


- ఒంగోలు (కల్చరల్‌)

కార్తీకమాసం ముగియటంతో మహిళలు పోలిస్వర్గం వేడుకలను ఆదివారం తెల్లవారుజామున వైభవంగా జరుపుకున్నారు. ఆవు నెయ్యితో వెలిగించిన దీపాలను నీటిలో విడిచిపెట్టారు. కార్తీకమాసంలో అత్యంత భక్తితో పరమేశ్వరుడిని ఆరాధించిన ’పోలి’ అనే గృహిణికి మార్గశిర పాడ్యమి రోజు స్వర్గప్రాప్తి కలిగిందని పురాణాలు చెబుతున్నాయి. దీని ప్రకారం ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య మరుసటి రోజు ఉదయాన్నే మహిళలు పోలి స్వర్గం ఉత్సవాన్ని నిర్వహించటం ఆనవాయితీ. ఏటా పోలి స్వర్గం సందర్భంగా ఒంగోలులోని రంగారాయుడు చెరువులో మహిళలు పెద్ద సంఖ్యలో దీపాలను వదులుతారు. కానీ ఈ సంవత్సరం కొవిడ్‌ నిబంధనల కారణంగా అధికారులు అనుమతించలేదు. దీంతో ఆలయాల్లోని కోనేరులు, ఇళ్లలోనూ మహిళలు వేడుకలు నిర్వహించారు. నగర పరిధిలోని కొప్పోలు చెరువు వద్ద సైతం పెద్దసంఖ్యలో మహిళలు పోలిస్వర్గాన్ని నిర్వహించారు.  

 

Updated Date - 2021-12-06T05:33:30+05:30 IST