పెట్రోకెమికల్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటుచేయాలి

ABN , First Publish Date - 2021-03-01T06:24:27+05:30 IST

కోనసీమ కేంద్రంగా ఓఎన్‌ జీసీ తదితర ఆయిల్‌ సంస్థలు చేపడుతున్న పనుల నేపథ్యంలో కోనసీమలో పెట్రోకెమికల్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటుచేయాలని కోనసీమ అభివృద్ధి సాధన సమితి అధ్యక్షుడు బండి రామకృష్ణ కోరారు.

పెట్రోకెమికల్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటుచేయాలి

కొత్తపేట, ఫిబ్రవరి 28: కోనసీమ కేంద్రంగా ఓఎన్‌ జీసీ తదితర ఆయిల్‌ సంస్థలు చేపడుతున్న పనుల నేపథ్యంలో కోనసీమలో పెట్రోకెమికల్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటుచేయాలని కోనసీమ అభివృద్ధి సాధన సమితి అధ్యక్షుడు బండి రామకృష్ణ కోరారు. ఆదివారం కొత్తపేటలో ఎస్‌.ఆదిత్యకిరణ్‌ స్వగృహం వద్ద నిర్వహించిన కోనసీమ అభివృద్ధి సాధన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.  కోనసీమ ప్రాంతానికి రైల్వేలైన్‌కు కేటాయించిన నిధులు వెంటనే విడుదల చేసి పనులు ప్రారంభించాలని, ఈప్రాంతం ద్వారా లబ్ధిపొందిన చమురు సంస్థలు ఇక్కడ విద్యార్థుల కోసం పెట్రోకెమికల్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. సమావేశంలో సాధన సమితి ఉపాధ్యక్షుడు వాడపల్లి సూరిబాబు, ప్రధానకార్యదర్శి రాయుడు శ్రీనివాస్‌, కార్యదర్శి ఎస్‌.ఆదిత్యకిరణ్‌, సభ్యులు కొప్పిశెట్టి వాసు, యడ్లపల్లి భగవాన్‌, నిమ్మకాయల చిన్నయ్యనాయుడు, చోడపనీడి సూరిబాబు, జలదాని రాము, గనిశెట్టి శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు.


Updated Date - 2021-03-01T06:24:27+05:30 IST