ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరిగింది

ABN , First Publish Date - 2022-05-17T04:50:21+05:30 IST

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర-2 విజయవంతమయ్యిందని, ఈ యాత్ర వల్ల ప్రజల్లో అ వగాహన, రాజకీయ చైతన్యం పెరిగిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కో శాధికారి శాంతకుమార్‌ అన్నారు.

ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరిగింది
సమావేశంలో మాట్లాడుతున్న శాంతకుమార్‌

- బండి సంజయ్‌  ప్రజాసంగ్రామ యాత్ర సక్సెస్‌

- బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్‌

మహబూబ్‌నగర్‌ ( క్లాక్‌టవర్‌), మే 16 : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేపట్టిన  ప్రజా సంగ్రామ యాత్ర-2 విజయవంతమయ్యిందని, ఈ యాత్ర వల్ల ప్రజల్లో అ వగాహన, రాజకీయ చైతన్యం పెరిగిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కో శాధికారి శాంతకుమార్‌ అన్నారు. సోమవారం బీజేపీ జిల్లా పార్టీకార్యాల యంలో జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన వి లేకర్ల  సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజ లకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక వైఫల్యం చెందారన్నారు. చేతైనైతే తెలంగాణ ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశారో వాటిపై మాట్లాడాలని, ఎంతవరకు పూర్తి చేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.  ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన హోంశాఖ మంత్రి అమి త్‌షా మాట్లాడిన మాటలపై టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు చేయడం సరి కాదన్నారు. జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా తెలంగాణ మిషన్‌ భగీరథకు కేంద్ర ప్రభుత్వం రూ. 2,500కోట్ల ఇచ్చిందన్నారు. ప్రజా సంక్షేమ పథకాల అమ లు దిశగా బీజేపీ  పనిచేస్తుందని తెలిపారు. సమావేశంలో  బీజేపీ నాయ కులు పద్మజారెడ్డి, పడాకుల బాల్‌రాజ్‌,  శ్రీనివాస్‌ రెడ్డి, పాండురంగా రెడ్డి, కిరణ్‌కుమార్‌ రెడ్డి, రామాంజనేయులు, అంజయ్య, పడాకుల సత్యం, రా ములు పాల్గొన్నారు.

నిరుద్యోగుల కోసం ఎన్ని పరిశ్రమలు తెచ్చారు?

బాదేపల్లి: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఎన్ని పరిశ్రమలు తెచ్చారని టీఆర్‌ఎస్‌ నేతలను బీజేపీ  రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్‌ ప్రశ్నించారు.  సోమవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మా ట్లాడారు. తుక్కుగూడలో నిర్వహించిన సభను చూసి జీర్ణించుకోలేకనే కేం ద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రసంగాన్ని టీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే టీఆర్‌ఎస్‌ బుద్ధి చెబుతారని అ న్నారు.  సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగరాజు, మిడ్జిల్‌ మం డల అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, కౌన్సిలర్‌ రాజు, నాయకులు పల్లె తిరుపతి, అనంతకిషన్‌, ప్రతాప్‌రెడ్డి, ఆంజనేయులు, మురళి, నరేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T04:50:21+05:30 IST