పొలిటికల్‌ హీట్‌

ABN , First Publish Date - 2021-02-27T05:47:24+05:30 IST

ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో అభ్యర్థులు పూర్తిగా ప్రచారంపై దృష్టి కేంద్రీకరించారు. ఈనేపథ్యంలో సాగర్‌ ఉప ఎన్నిక ఏప్రిల్‌ 6న ఉంటుందని సమాచారం మేరకు మండే ఎండలతోపాటు జిల్లాలో పొలిటికల్‌ హీట్‌ పెరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియగా, అభ్యర్థులు ప్రచారాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లేందుకు కసరత్తు ముమ్మరం చేశారు.

పొలిటికల్‌ హీట్‌

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు

ఇక కీలక నేతల పర్యటనలు

సాగర్‌ ఉప ఎన్నికపైనా పార్టీల దృష్టి


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ):  ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో అభ్యర్థులు పూర్తిగా ప్రచారంపై దృష్టి కేంద్రీకరించారు. ఈనేపథ్యంలో సాగర్‌ ఉప ఎన్నిక ఏప్రిల్‌ 6న ఉంటుందని సమాచారం మేరకు మండే ఎండలతోపాటు జిల్లాలో పొలిటికల్‌ హీట్‌  పెరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియగా, అభ్యర్థులు ప్రచారాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. పోలింగ్‌కు సరిగ్గా పక్షం రోజులే ఉండటంతో అధికారులు ఎన్నిక ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సాగ ర్‌ ఉప ఎన్నికకు నేడో, రేపో ప్రత్యేక నోటిఫికషన్‌ వెలువడుతుందనే సమాచారం రావడంతో అంతటా ఎన్నికల వాతావరణం వేడెక్కింది.


ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రచారపర్వంలోకి దిగారు. వాల్‌ రైటింగ్‌లు, కరపత్రాల ద్వారా వ్యక్తిగతంగా కలవడం, నిరుద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలా వర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించే క్రమంలోనే నామినేషన్ల ప్రక్రియను పో టాపోటీగా నిర్వహించారు. ప్రచారంలో ప్రత్యేక రథాలు, కాన్వాయ్‌, ఉత్తేజం నింపే పాటలను వినియోగిస్తున్నారు. ఓటర్ల దృష్టిని తమవైపునకు తిప్పుకునేందుకు అయోధ్య రాముడేనా? భద్రాచల రాముడు కనిపించడా? వంటి అంశాలను తెరపైకి తెచ్చారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నారంటూ ఎవరి వాదనను వారు వినిపిస్తున్నారు. విప్లవ, తెలంగాణ సాధన, సేవా నేపథ్యాలను ఓటర్లకు అభ్యర్థులు వివరిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ తదితరుల పర్యటనలు ఇప్పటికే పూర్తయ్యాయి. వచ్చే రోజుల్లో మరిన్ని పర్యటనలు, పరస్పర విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎదురుకానున్నాయి. 1.30లక్షల ఉద్యోగాలు కల్పించామని లెక్కలతో సహా మంత్రి కేటీఆర్‌, అభ్యర్థి పల్లా ప్రకటించగా, అది అవాస్తవమని,  బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ అభ్యర్థులంతా ప్రతిసవాళ్లు విసరడంతో ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం వేడెక్కింది.


వేగం పెంచిన బీజేపీ

ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వస్తుందన్న సమాచారంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ‘టార్గెట్‌ సాగర్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.ఆపార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌ గత బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర పధాధికారుల సమావేశం నిర్వహించారు. సాగర్‌లో గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో విజయం తమదేనంటూ ప్రకటించి, మరుసటి రోజే హాలియార్యాలీలో పాల్గొని వివిధ పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలకు కాషాయం కండువా కప్పారు.అంతేగాక స్థానిక క్యాడర్‌లో జోష్‌ పెం చేలా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు ప్రసంగించారు. ఇప్పటికే ఆర్‌ఎ్‌సఎస్‌,భజరంగ్‌ దళ్‌,బీజేపీ నేతలు గ్రామాల వారీగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఇన్‌చార్జులు సంకినేని,చాడ సురే్‌షరెడ్డి పార్టీ అంతర్గత నిర్మాణ పని,గెలుపు గుర్రాలను సమన్వయం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. సాగర్‌ ఉపఎన్నికకు కీలక నేతలు ప్రచారం చేస్తారని ఎమ్మెల్యే రఘునందన్‌ తమప్రచారశైలిని హాలియా సభలో చెప్పకనే చెప్పారు.


జానా చుట్టే కాంగ్రెస్‌ రాజకీయం

సాగర్‌ ఉప ఎన్నికపైనే రాష్ట్ర కాంగ్రెస్‌ భవిష్యత్‌ ఆధారపడిఉంది. ఈ ఎన్నిక తనకు, పార్టీకి ప్రతిష్ఠాత్మకమేనని, అందుకే వయసు మీద పడినా బరిలో దిగుతున్నానంటూ సీనియర్‌ నేత జానారెడ్డి ప్రకటించారు. నాలుగు నెలలుగా నియోజకవర్గంలో గ్రామగ్రామాన పర్యటిస్తున్నారు. అన్ని గ్రామాలు, నేతలపై పట్టు ఉండటంతో నేరుగా వారిని సంప్రదించడం, ఫోన్లలో పలకరించడం చేస్తూ గెలవాల్సిన అంశాన్ని వివరిస్తున్నారు. నోటిఫికేషన్‌ రావడమే ఆలస్యం, స్థానికంగా మకాం వేసేందుకు కాం గ్రెస్‌ దిగ్గజాలు సిద్ధమవుతున్నారు.


అభ్యర్థిని తేల్చుకోలేకపోతున్న టీఆర్‌ఎస్‌

ఉప ఎన్నిక మార్చి నెలలో ఉంటుందని, జిల్లా నేతలంతా ఆ మూడ్‌లోనే ఉండాలని, మంత్రి జగదీ్‌షరెడ్డి అక్కడ విస్తృతంగా పర్యటించాలని నాలుగు నెలల క్రితమే సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. నిఘా వర్గాలు, ప్రైవేటు ఏజెన్సీలు, నేతల సూచన లు పరిగణనలోకి తీసుకొని సాగర్‌ నియోజకవర్గంలో వందల కోట్ల అభివృద్ధి పనులకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి చివరికి హాలియాలో భారీ సభ నిర్వహించారు. ఈ సభలో పూర్తిగా నల్లగొండ జిల్లా సాగునీరు, రైతుల సంక్షేమం, కాంగ్రెస్‌ నేతలను టార్గెట్‌ చేస్తూ ఎన్నికల ప్రచారానికి సీఎం తెరలేపారు. అయితే అభ్యర్థి విషయంలో ఇంకా సస్పెన్ష్‌ కొ నసాగుతోంది. ప్రఽధానంగా తేరా చిన్నపరెడ్డి, నోముల భగత్‌, ఎంసీ కోటిరెడ్డి పేర్లు వినిపిస్తున్నా యి. అత్యధికంగా 40వేల ఓట్లు ఉన్న గిరిజనులను ఆకర్షించాలంటే రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌నాయక్‌ పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. పార్టీ పరంగా కాంగ్రె్‌సతో పోలి స్తే సానుకూలంగా ఉన్నట్టు సర్వేలో వెల్లడికావడం అధికార పార్టీకి కొంత ఊరటనిచ్చే అంశం.

Updated Date - 2021-02-27T05:47:24+05:30 IST