పారిశుధ్య పోస్టుల్లో పొలిటికల్‌ గలీజు

ABN , First Publish Date - 2022-05-23T06:00:23+05:30 IST

మునిసిపాలిటీల చరి త్రలోనే ఇదో భారీ కుంభకోణం..! పారి శుధ్య కార్మికుల పోస్టు ల భర్తీలో అధికార పా ర్టీ ప్రజాప్రతినిధుల ఆ శ్రిత పక్షపాతం..! రి జ ర్వేషన్ల రోస్టర్‌ వి ధానాన్ని అ డ్డంగా బొం దపెట్టి.. అస్మదీ యులకు పోస్టులు కట్టబెట్టిన వైనం..! ఏకంగా 43 పారిశుధ్య కార్మిక పోస్టులను పక్కదారి పట్టించిన ఉదంతం..! గుట్టుచప్పుడు కాకుం డా జరిగిన ఈ అక్రమాలకు కలెక్టర్‌ ఆమోదముద్ర..! ఉపాధి కల్పన శాఖ అనుమతి లేనిదే.. అడ్డగోలుగా ట్రెజరీ నుంచి జీతాల విడుదల..! అధికార పార్టీ ప్రజాప్రతినిధులే సూత్రధారులు.. అధికారులు, సిబ్బంది.. పాత్రధా రులే..! కోట్ల రూపాయలు చేతులు మారిన ఈస్కాం.. నిర్మల్‌ మున్సిపాలిటీలో జరిగింది. ఏడోతరగతి విద్యార్హతతో భర్తీ చేయాల్సిన స్వీపర్‌, మురి కి కాలువలు/డ్రైనేజీలను శుభ్రం చేయడం, చెత్తసేకరణ వంటి పో స్టులను.. డిగ్రీలు, పీజీలు చేసిన పట్టభద్రులకు కట్టబెట్టారు.

పారిశుధ్య పోస్టుల్లో పొలిటికల్‌ గలీజు
నిర్మల్‌ పురపాలక సంఘం

నిర్మల్‌ మునిసిపాలిటీలో అక్రమాలు

పట్టభద్రులకు స్వీపర్లుగా కొలువులు

డ్రైనేజీ క్లీనింగ్‌ పనుల్లోనూ నియామకం  

జాబితాలో చైర్మన్‌ కూతురు, అల్లుడు!

మరికొన్ని పోస్టుల్లో నేతల బంధుమిత్రులు

అంగట్లో 43 కొలువుల అమ్మకాలు

గుడ్డిగా ఆమోదించిన జిల్లా కలెక్టర్‌

భారీ కుంభకోణం అంటున్న విపక్షాలు

నిర్మల్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీల చరి త్రలోనే ఇదో భారీ కుంభకోణం..! పారి శుధ్య కార్మికుల పోస్టు ల భర్తీలో అధికార పా ర్టీ ప్రజాప్రతినిధుల ఆ శ్రిత పక్షపాతం..! రి జ ర్వేషన్ల రోస్టర్‌ వి ధానాన్ని అ డ్డంగా బొం దపెట్టి.. అస్మదీ యులకు పోస్టులు కట్టబెట్టిన వైనం..! ఏకంగా 43 పారిశుధ్య కార్మిక పోస్టులను పక్కదారి పట్టించిన ఉదంతం..! గుట్టుచప్పుడు కాకుం డా జరిగిన ఈ అక్రమాలకు కలెక్టర్‌ ఆమోదముద్ర..! ఉపాధి కల్పన శాఖ అనుమతి లేనిదే.. అడ్డగోలుగా ట్రెజరీ నుంచి జీతాల విడుదల..! అధికార పార్టీ ప్రజాప్రతినిధులే సూత్రధారులు.. అధికారులు, సిబ్బంది.. పాత్రధా రులే..! కోట్ల రూపాయలు చేతులు మారిన ఈస్కాం.. నిర్మల్‌ మున్సిపాలిటీలో జరిగింది. ఏడోతరగతి విద్యార్హతతో భర్తీ చేయాల్సిన స్వీపర్‌, మురి కి కాలువలు/డ్రైనేజీలను శుభ్రం చేయడం, చెత్తసేకరణ వంటి పో స్టులను.. డిగ్రీలు, పీజీలు చేసిన పట్టభద్రులకు కట్టబెట్టారు.

44 పోస్టులకు.. 43 భర్తీ

నిర్మల్‌ మునిసిపాలిటీలోని పారిశుధ్య విభాగంలో 44 రెగ్యూలర్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కొందరు ఉద్యోగులు చనిపోవడం.. మరికొందరు పదోన్నతులు పొందడంతో ఈ ఖాళీలు ఏ ర్పడ్డాయి. ఈ విషయాన్ని ఓ ఇన్‌చార్జి పారిశుధ్య అధికారి గు ర్తించారు. అతడిపైనా బోగస్‌ సర్టిపికెట్ల అభియోగాలున్నాయి. ఆయన ఖాళీల విషయాన్ని మునిసిపల్‌ పాలక మండలి చెవి లో వేశారు. అంతే.. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్న చందంగా.. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి.. పారిశుధ్య కా ర్మికుల పోస్టులను అమ్ముకునేందుకు ప్రణాళిక రూపొందించుకున్నా రు. వెంటనే జిల్లా ఉపాధి కల్పనాధికారికి లేఖ రాశారు. సదరు అధికారి నుంచి వచ్చిన సీనియారిటీ జాబితాను కాదని.. 43 పోస్టులను అస్మ దీయులతో భర్తీ చేసేలా కుట్రపన్నారు. ఆ జాబితాలోని ఎవరికీ కాల్‌లెట ర్స్‌ పంపలేదు. చైర్మన్‌ సహా.. కొందరు కౌన్సిలర్లు వారి బంధుగణానికి చెందిన వారి పేర్లతో జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో తూతూమంత్రంగా ఇంటర్వ్యూలు నిర్వహించి.. అస్మదీ యులకు పోస్టింగులు ఇచ్చేశారు. నిజానికి 7వ తరగతి విద్యార్హత ఉండా ల్సిన ఈ పోస్టులను.. డిగ్రీలు, పీజీలు, ఫార్మసీలో పట్టభద్రులతో భర్తీ చేశారు. ఇలా కొలువులు పొం దినవారిలో మునిసిపల్‌ చైర్మన్‌ కూతురు, అల్లుడు, పలువురు కౌన్సిలర్ల బంధుమిత్రులు, అధికార పార్టీ నియోజకవర్గ అగ్రనేత బంధువులు ఉన్నట్లు తెలిసింది. ఈ వ్యవ హారంలో కోట్ల రూపాయలు చే తులు మారినట్లు విశ్వసనీయవర్గాలు చె బుతున్నాయి.

కూర్చొబెట్టి జీతాలు!

నిజానికి పారిశుధ్య కార్మికులకు డ్రెస్‌కోడ్‌ ఉంటుంది. రో జూ వీధులను ఊడ్వడం, డ్రైనేజీలను శుభ్రం చేయడం, ఇం టింటికీ వెళ్లి చెత్తను సేకరించడం వారి విధులు. తాజాగా నియమితు లైన 43 మంది పట్టభద్ర పారిశుధ్య కార్మికులు మాత్రం ఆ విధులను నిర్వర్తించడం లేదు. తమకు బదులు, ఇత రులతో పనికానిస్తున్నారు. కూర్చుని జీతాలు తీసుకుంటున్నారు. విధులకు హాజరైనట్లుగా రోజూ పారిశుధ్య విభాగం రిజిస్టర్‌లో సంతకాలు చేస్తున్నారు.

అంతా గప్‌చిప్‌!

నియామకాలు పూర్తయితే.. ఆ వివరాలను జిల్లా ఉపాధి కల్పన అధి కారికి తెలియజేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరిలోనే నియామకాలు పూర్త యినా.. ఎంతకీ వివరాలు అందజేయకపోవడంతో.. జిల్లా ఉపాధి కల్పన అధికారి స్వయంగా మునిసిపల్‌ కమిషనర్‌కు లేఖలు రాశారు. ‘‘మేం పంపిన జాబితాలో ఎంత మంది ఎంపికయ్యారు? ఎవరెవరికి కొలువులు ఇచ్చారు? ఆ వివరాలను అందజేయండి’’ అం టూ పలుమార్లు లేఖ లు రాసినా.. మునిసిపల్‌ కమిషనర్‌ నుంచి స్పందన శూన్యం. నిజానికి ఉపాధి కల్పన అధికారి ఆమోద ముద్ర పడ్డాకే.. అపాయిం ట్‌మెంట్ల ప్రక్రియ పూర్తయినట్లు. ఆయన సూచనల మేరకే జిల్లా ట్రెజరీ అధికారులు ఎంపికైన కా ర్మికులు/ఉద్యోగులకు ఐడీని కేటాయించి, జీతాలను విడుదల చేస్తారు. ఇక్కడ మాత్రం.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు హుకుం వేయడంతో.. ఉపాధికల్పన అధికా రి ఆమోదం లేకుండానే.. ట్రెజరీ అధికారులు జీతాలు విడుదల చేస్తున్నా రు. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు నెలల పాటు.. అడ్డదారిలో ఎంి పకైన పట్టభద్ర పారిశుధ్య కార్మికులను కూచోబెట్టి జీతాలిచ్చేస్తున్నారు. అప్పటి మునిసిపల్‌ మేనేజర్‌ ఈ వ్యవహారం నిబంధనలకు విరుద్ధ మంటూ అడ్డుచెప్పినా.. ప్రజాప్రతి నిధులు ‘‘గమ్మునుండు’’ అంటూ బెది రించారు. వారం రోజులుగా ఈ బా గోతం క్రమంగా వెలుగులోకి వస్తుం డడంతో.. అధికార పార్టీ నేతలు కొం దరు మునిసిపల్‌ కమిషనర్‌, పారి శుధ్య విభాగం ఇన్‌చార్జి అధికారిని బలవంతంగా సెలవులపై పంపినట్లు తెలిసింది. మునిసిపాలిటీలో ఈ వ్యవహారాన్ని గోప్యంగా పెట్టారు. 

ఎందుకీ కక్కుర్తి?

ఏ ప్రభుత్వ విభాగంలోనైనా.. కిందిస్థాయి విధులు నిర్వర్తిస్తున్న వారు మూడేళ్ల సర్వీసును పూర్తిచేసుకుంటే.. విద్యార్హతలను బట్టి పదోన్నతులు ఉంటాయి. ఇక్కడ కూడా తొలుత పారిశుధ్య కార్మికులుగా నియమించు కునేలా చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. మూడేళ్లు నెట్టుకొస్తే.. పట్టభద్రులు కావడంతో పదోన్నతులు ఇప్పించే అవకాశాలుంటాయని.. అందుకే ఇంత పెద్ద కుంభకోణానికి తెరతీసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - 2022-05-23T06:00:23+05:30 IST