రాజకీయాలు కలుషితం

ABN , First Publish Date - 2021-10-24T05:47:26+05:30 IST

ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు కలుషితమైపో యాయని, రాజకీయాల్లో భావఘర్షణ ఉండొచ్చు కానీ భౌతిక ఘర్షణ వాంఛనీ యం కాదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి అన్నారు.

రాజకీయాలు కలుషితం
సమావేశంలో మాట్లాడుతున్న రామకృష్ణారెడ్డి

  • టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి

అనపర్తి, అక్టోబరు 23: ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు కలుషితమైపో యాయని, రాజకీయాల్లో భావఘర్షణ ఉండొచ్చు కానీ భౌతిక ఘర్షణ వాంఛనీ యం కాదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని  రామవరంలో ఏర్పాటుచేసిన విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన వరవడికి శ్రీకారం చుట్టారని భూతులు మాట్లాడడం పరిపాటిగా మా రిందన్నారు. ఇవాళ రాష్ట్రం గంజాయి, డగ్స్‌ మాఫియాలకు కేంద్రంగా మారిం దని, ఇది పదే పదే చర్చకు రావడంతో దీనిని పక్కదారి పట్టించేందుకు అధికార ప్రతినిధి పట్టాభి మాటలను వక్రంగా మార్చి దాడులకు పాల్పడ్డారని అన్నారు. 70ఏళ్ల చంద్రబాబు 36 గంటల దీక్ష చేయడంపై సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మహిళలు ఉన్న సభలో పట్టాభి అన్న పదాన్ని పదే పదే ప్రసంగించలేదా అని ప్రశ్నించారు. 

ఎమ్మెల్యే దంపతుల సహకారంతోనే రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి

అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి ఆదిలక్ష్మి దంపతుల సహకారం తోనే తనకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి లభించిందని, ముందుగా ఆ దంపతులకు కృతజ్ఞతలు చెబుతున్నానని రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. బిక్కవోలు వినా యకుడి ఆశీస్సులు ఉండడంతోనే తనను ఈ పదవికి ఎంపిక చేశారని అన్నారు.  ఈ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నానో అర్థం చేసుకున్న వారికి అర్థం చేసుకున్నం త అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై అవగాహన లేకుండా చంద్రబాబు దీక్షపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేస్తున్నారని ముందుగా అవ గాహన పెంచుకోవాలన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు సిరసపల్లి నాగే శ్వరరావు, పడాల ఆదినారాయణరెడ్డి, పెంకే శ్రీనివాస్‌, నల్లమిల్లి సుబ్బారెడ్డి, పులగం అచ్చిరెడ్డి, బొడ్డు సత్తిరాజు, సోమరాజు, తమలంపూడి సుధాకరరెడ్డి, నల్లమిల్లి వెంకటసుబ్బారెడ్డి, నూతిక బాబూరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T05:47:26+05:30 IST