CMకు విషమ పరీక్ష.. Champawatలో మొదలైన పోలింగ్

ABN , First Publish Date - 2022-05-31T16:41:37+05:30 IST

ఈ మధ్య కాలంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు వరుసపెట్టి మారారు. ఒకే ఏడాదిలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే పుష్కర్ సింగ్ ధామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. అప్పటికే ఆయన..

CMకు విషమ పరీక్ష.. Champawatలో మొదలైన పోలింగ్

డెహ్రడూన్: ఉత్తరాఖండ్‌(Uttarakhand)లోని చంపావత్‌(Champawat) అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ మంగళవారం ఉదయమే ప్రారంభమైంది. ఈ స్థానం నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి(Chief Minister) పుష్కర్ సింగ్ ధామి(Pushkar Singh Dhami) పోటీ చేస్తున్నారు. కాగా, ఈ ఎన్నికల ఆయనకు విషమ పరీక్షలా మారింది. ఈ ఎన్నికలో గెలిస్తేనే ముఖ్యమంత్రి పదవి ఉంటుంది. లేదంటే బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని పార్టీ నేతలే అంటున్నారు. ఈ ఎన్నికలో 100 శాతం ఓటింగ్ నమోదు అవుతుందని, తాను అఖండ మెజారిటీతో విజయం సాధిస్తానని సీఎం ధామి విశ్వాసం వ్యక్తం చేశారు. చంపావత్ ఓటర్లకు అభినందనలు తెలిపేందుకు తాను ఎంతో ఉత్సాహంతో ఉన్నానని, కానీ ఫలితం వచ్చే వరకు ఆగుతానని ఆయన అన్నారు.


ఈ మధ్య కాలంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు వరుసపెట్టి మారారు. ఒకే ఏడాదిలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే పుష్కర్ సింగ్ ధామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. అప్పటికే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఈ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించి మరోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ పుష్కర్ ఓడిపోయారు. అయినప్పటికీ ఆయననే ముఖ్యమంత్రిగా కొనసాగించారు. దీంతో అసెంబ్లీకి ఎన్నిక కావడం అనివార్యం అయింది. ఈ నేపథ్యంలో చంపావత్‌ ఎమ్మెల్యే కైలాష్ చంద్ర గహ్‌తోరి తన పదవికి రాజీనామా చేసి ఆ స్థానాన్ని పుష్కర్ సింగ్‌కు ఇచ్చారు.

Updated Date - 2022-05-31T16:41:37+05:30 IST