ఉయ్యూరు, మార్చి 5 : ఉయ్యూరులో పోలింగ్ కేంద్రాలను విజయవాడ సిటీ పోలీస్క మీషనర్ బత్తిన శ్రీనివాసులు శుక్రవారం పరిశీలించారు. వీఆర్కెఎం పాఠశాల ఆవరణలో స్ట్రాంగ్ రూమ్, సీబి ఎం పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను చూశారు. ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ రంగా రావు వివరాలు తెలియచేశారు. ఈస్ట్ జోన్ ఏసీపీ విజయ్‌పాల్, ఉయ్యూరు సీఐ నాగప్రసాద్ బందోబస్తు వివరాలు తెలిపారు.