ఓట‌రు కార్డుకు ప్ర‌త్యామ్నాయంగా మ‌రో 18 గుర్తింపు కార్డులు

ABN , First Publish Date - 2020-11-28T22:33:06+05:30 IST

గ్రేటర్ హైదరాబాద్‌లో డిసెంబర్ 1న జరిగే పోలింగ్‌కు ఓట‌రు గుర్తింపు కార్డులేకున్నా ప్రత్యామ్నాయంగా చూపించాల్సిన కార్డులపై జిల్లా ఎన్నిక‌ల అధికారి డి. ఎస్. లోకేశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు.

ఓట‌రు కార్డుకు ప్ర‌త్యామ్నాయంగా మ‌రో 18 గుర్తింపు కార్డులు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో డిసెంబర్ 1న జరిగే పోలింగ్‌కు ఓట‌రు గుర్తింపు కార్డులేకున్నా ప్రత్యామ్నాయంగా చూపించాల్సిన కార్డులపై జిల్లా ఎన్నిక‌ల అధికారి డి. ఎస్. లోకేశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. పోలింగ్ కేంద్రంలో చూపించాల్సిన ఫోటో గుర్తింపు కార్డుల‌లో ఆధార్, పాస్ పోర్ట్ మొదలుకొని 18 రకాల కార్డులను ప్రకటించారు. 


1. ఆధార్ కార్డు, 2. పాస్‌పోర్ట్‌, 3.  డ్రైవింగ్ లైసెన్స్‌, 4. ఫోటోతో కూడిన‌ స‌ర్వీస్ ఐడెంటిఫై కార్డ్‌, 5. ఫోటోతో కూడిన‌ బ్యాంకు పాస్‌బుక్‌, 6. పాన్ కార్డు, 7.  ఆర్‌.జి.ఐ, ఎన్‌.పి.ఆర్ స్మార్ట్ కార్డు, 8. జాబ్ కార్డు, 9. హెల్త్ కార్డు, 10. ఫోటోతో కూడిన పింఛ‌న్‌ డాక్యుమెంట్, 11. ఎం.ఎల్‌.ఏ, ఎం.పి, ఎమ్మెల్సీల‌కు జారీచేసిన అధికార గుర్తింపు ప‌త్రం, 12. రేషన్ కార్డు, 13. కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం, 14. ఫ్రీడమ్ ఫైటర్ ఐడెంటిఫై కార్డు, 15. ఆర్మ్స్ లైసెన్స్ కార్డు, 16. అంగవైకల్యం సర్టిఫికేట్, 17. లోక్ సభ, రాజ్యసభ మెంబర్ ఐడెంటిఫై కార్డు, 18. పట్టదారు పాస్ బుక్ 

Updated Date - 2020-11-28T22:33:06+05:30 IST