పురపోరుకు యంత్రాంగం సమాయత్తం..!

ABN , First Publish Date - 2021-03-09T06:01:56+05:30 IST

జిల్లాలో కడప కార్పొరేషనతో పాటు ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, రాయచోటి, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు మున్సిపాలిటీల్లోని 136 డివిజన్లు/వార్డులకు బుధవారం పోలింగ్‌ జరగనుంది. 562 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు సి.హరికిరణ్‌ ఆఽధ్వర్యంలో సర్వం సిద్ధం చేశారు. 400 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

పురపోరుకు  యంత్రాంగం సమాయత్తం..!

నేడు పంపిణీ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రి సరఫరా

పోలింగ్‌ విధుల్లో 3 వేల మంది సిబ్బంది

2 వేల మందితో పోలీస్‌ బందోబస్తు

136 వార్డులు.. బరిలో 562 మంది అభ్యర్థులు

ప్రచార రథాలకు బ్రేకులు

రేపు పోలింగ్‌


పట్టణ సంగ్రామానికి ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధమైంది. 10వ తేది బుధవారం ఓటర్ల తీర్పు కోసం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు జరిగే 136 వార్డుల్లో 400 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. డిసి్ట్రబ్యూషన, కలెక్షన, కౌంటింగ్‌ కేంద్రాల నుంచి నేడు ఎన్నికల సామగ్రి సరఫరా చేయనున్నారు. ఇందుకోసం మున్సిపాలిటీ వారీగా కేంద్రాలు నెలకొల్పారు. బరిలో ఉన్న 562 మంది అభ్యర్థుల్లో 136 మంది ప్రతినిధులను ఎన్నకోవడానికి 3.85 లక్షల మంది ఓటర్లు తీర్పు ఇచ్చే కీలక పోలింగ్‌ ఘట్టం బుధవారం ఉయదం 7 గంటలకు ప్రారంభం అవుతుంది.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో కడప కార్పొరేషనతో పాటు ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, రాయచోటి, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు మున్సిపాలిటీల్లోని 136 డివిజన్లు/వార్డులకు బుధవారం పోలింగ్‌ జరగనుంది. 562 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు సి.హరికిరణ్‌ ఆఽధ్వర్యంలో సర్వం సిద్ధం చేశారు. 400 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్‌ ఆఫీ్‌సర్‌ (పీఓ), అసిస్టెంట్‌ పోలింగ్‌ ఆఫీసర్‌ (ఏపీఓ), ఓపీఓలు, రూట్‌ ఆఫీసర్లు, మైక్రో అబ్జర్వర్లు, రిజర్వు సిబ్బందితో కలిపి 3 వేల మంది విధుల్లో పాల్గొననున్నారు. అదే క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటుకు జిల్లా ఎస్పీ కేకేఎన అన్బురాజన 2 వేల మంది సిబ్బందికి డ్యూటీలు వేశారు. సోమవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా దిశానిర్దేశం చేశారు. ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు పట్టణాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.


పోలింగ్‌ రోజు..

- బుధవారం ఉదయం 5.30 గంటలకే సిబ్బంది పోలింగ్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారు. ముందు రోజే డిస్ట్రబ్యూషన సెంటర్‌ నుంచి పోలింగ్‌ బాక్సులు, బ్యాలెట్‌ పత్రాలు తీసుకుని వెళతారు.

- ఉదయం 6 గంటల నుంచి 6.15 గంటల మధ్యలో మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తారు. 

- ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై.. సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. 5 గంటల తరువాత వరుసలో నిలబడిన అందరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు.

- పోలింగ్‌ పూర్తి అయ్యాక పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్‌ బాక్సులకు సీలు వేసి బందోబస్తు మధ్య సా్ట్రంగ్‌ రూంకు తరలిస్తారు. 

- ఓటు వేసేందుకు ఓటరు గుర్తింపు (ఏపిక్‌) కార్డుతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదించిన 20 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది.

- తమ ఓటును ఎవరైనా వేసేసి ఉంటే అక్కడే పోలింగ్‌ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేస్తే.. ఎన్నికల నియమావళిని అనుసరించి చాలెంజ్‌ ఓటు వేసేందుకు పీఓ అనుమతి ఇస్తారు.


సమస్మాత్రక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

కడప నగరంతో పాటు ఎన్నికలు జరిగే పట్టణాల్లోని 200 ప్రాంతాల్లో పోలింగ్‌ జరుగుతుంది. అందులో 100 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంటుంది. సీసీ కెమరాలు, వీడియో చిత్రీకరణ, బాడీవేర్‌ కెమరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే 1,500 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. ఈ ఎన్నికల్లో రూ.45 లక్షలకుపైగా అనధికారికంగా రవాణా చేస్తున్న నగదు సీజ్‌ చేశారు. 


ఎన్నికలు జరిగే వార్డులు, పోలింగ్‌ కేంద్రాలు, సిబ్బంది వివరాలు

---------------------------------------------------------------------------------

మున్సిపాలిటీ వార్డులు పీఎ్‌సలు సిబ్బంది బ్యాలెట్‌ బాక్సులు

---------------------------------------------------------------------------------

కడప                     27 149 745 149

బద్వేలు             25 43 310 43

ప్రొద్దుటూరు             32 101 145 157

ఎర్రగుంట్ల             7 14 110 14

రాయచోటి             3 6 55 12

జమ్మలమడుగు     18 37 185 37

మైదుకూరు             24 50 380 50

---------------------------------------------------------------------------------

మొత్తం               136 400 1,930 462

---------------------------------------------------------------------------------

Updated Date - 2021-03-09T06:01:56+05:30 IST