కమలా హారిస్‌ పనితీరుపై అమెరికన్ల అసంతృప్తి!

ABN , First Publish Date - 2021-08-03T13:03:44+05:30 IST

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పనితీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా సంచలనం సృష్టించిన హారిస్‌ శ్వేత సౌధంలో కొలువుదీరి 6 నెలలైనా తన పదవికి న్యాయం చేయడం లేదని 48 శాతం మంది పెదవి విరుస్తున్నారు. టెలిగ్రాఫ్‌ వంటి స్థానిక మీడియా సంస్థలు నిర్వహించిన పోలింగ్‌లో హారిస్‌ రేటింగ్‌ భారీగా పడిపోయింది.

కమలా హారిస్‌ పనితీరుపై అమెరికన్ల అసంతృప్తి!

హారిస్‌ పనితీరు అంతంతే!

48శాతం మంది అమెరికన్ల అసంతృప్తి

వాషింగ్టన్‌, ఆగస్టు 2: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పనితీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా సంచలనం సృష్టించిన హారిస్‌ శ్వేత సౌధంలో కొలువుదీరి 6 నెలలైనా తన పదవికి న్యాయం చేయడం లేదని 48 శాతం మంది పెదవి విరుస్తున్నారు. టెలిగ్రాఫ్‌ వంటి స్థానిక మీడియా సంస్థలు నిర్వహించిన పోలింగ్‌లో హారిస్‌ రేటింగ్‌ భారీగా పడిపోయింది.


టెలిగ్రాఫ్ మీడియా చేసిన సర్వేలో ఉపాధ్యక్షురాలిగా ఆమె పని తీరు అస్సలు బాగోలేదని మెజారిటీ ప్రజలు స్పష్టం చేశారు. తాజాగా జరిగిన రెండు సర్వేల్లో 46 శాతం మంది ప్రజలు మాత్రమే వీపీగా కమలా హారిస్ పనితీరును మెచ్చుకున్నట్టు తేలింది. దాదాపు 48శాతం మంది ప్రజలు ఆమె పనితీరుపై పెదవి విరిచారట. దీంతో 1970 తర్వాత బాధ్యతలు స్వీకరించిన ఆరునెలల్లోనే  అత్యంత తక్కువ ప్రజాధారణ పొందిన ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ గుర్తింపు పొందారని అక్కడి మీడియా సంస్థలు కథనాలు వెలువరిస్తున్నాయి.


ఇదిలా ఉంటే.. అగ్రరాజ్య అధినేతగా బైడెన్ పనితీరు బాగుందని 51.3శాతం మంది ప్రజలు కితాబిచ్చారట. సుమారు 44.9శాతం మంది ప్రజలు బైడెన్ పనితీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారట. మిగిలిన ప్రజలు ఎటూ తేల్చుకోలేకపోయారని సర్వేలో వెల్లడైంది. 

Updated Date - 2021-08-03T13:03:44+05:30 IST