చెరువు కట్ట మరమ్మతు పనులు పూర్తి

ABN , First Publish Date - 2020-10-25T11:08:02+05:30 IST

భువనగిరి పెద్దచెరువు కట్ట మరమ్మతు పనులు పూర్తయ్యాయి. గురువారం రాత్రి చెరువు కట్ట ఓవైపు కుంగిపోవడంతో చెరువు కట్ట ప్రమాదకరస్థితికి చేరింది.

చెరువు కట్ట మరమ్మతు పనులు  పూర్తి

భువనగిరి టౌన్‌, అక్టోబరు 24: భువనగిరి పెద్దచెరువు  కట్ట మరమ్మతు పనులు పూర్తయ్యాయి. గురువారం రాత్రి చెరువు కట్ట ఓవైపు కుంగిపోవడంతో చెరువు కట్ట ప్రమాదకరస్థితికి చేరింది. దీంతో యుద్ధప్రాతిపదిక చేపట్టిన మరమ్మతు పనులు శనివారం పూర్తయ్యాయి. చెరువుకట్ట కుంగిన ప్రాంతంలో ఇసుక బస్తాలు, బంకమట్టితో మరమ్మతు చేశారు. దసరా అనంతరం చెరువు లోపలిభాగంలో రింగు బండను నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమైన మరమ్మతు పనులు పూర్తికావడంతో చెరువుకట్టకు ముప్పు తప్పింది.


అలాగే ప్రమాద నివారణకు చేపట్టిన చర్యల్లో భాగంగా తగ్గించిన రెండు కత్వల ఎత్తును కూడా త్వరలో పునర్నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. కాళేశ్వరం, ఇరిగేషన్‌ శాఖ అధికారుల పర్యవేక్షణలో మరమ్మతు పనులు కొనసాగగా ఎమ్మెల్యే పైళ్లశేఖర్‌రెడ్డి, కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌, మునిసిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన అంజనేయులు పనులను పర్యవేక్షించారు. 

Updated Date - 2020-10-25T11:08:02+05:30 IST