వర్షం కోసం మేలచెరువు రైతుల పూజలు

ABN , First Publish Date - 2022-06-26T04:54:25+05:30 IST

మండల పరిధిలోని మేలచెరువు గ్రామానికి చెందిన రైతులు వ ర్షం కోసం శనివారం ప్రత్యేక పూజలు చేశారు.

వర్షం కోసం మేలచెరువు రైతుల పూజలు
ఎద్దుల బండ్లతో ఊరేగింపుగా వెళ్తున్న రైతులు

గద్వాల, జూన్‌ 25: మండల పరిధిలోని మేలచెరువు గ్రామానికి చెందిన రైతులు వ ర్షం కోసం శనివారం ప్రత్యేక పూజలు చేశారు. గ్రామం నుంచి  25ఎద్దుల బండ్లతో కృ ష్ణానదికి బాజాభజంత్రీలు, భజనలతో వెళ్లారు.  కృష్ణాజలాలను బిందెలతో తీసు కొని ఎడ్లబండ్లపై ఊరేగింపుగా తీసుకొచ్చారు. గ్రామంలోని శివాలయంలో స్వామివారికి కృష్ణా జలాలలో అభిషేకం చేశారు. ఇతర ప్రాంతాలలో వర్షం కురుస్తున్న గద్వాలలో మొఖం చాటేయడంతో వర్షం కోసం వరుణదేవుడిని వేడుకుంటున్నామని రైతులు తెలిపారు. 

Updated Date - 2022-06-26T04:54:25+05:30 IST