నీటి వనరులు అన్యాక్రాంతం కాకుండా చూడాలి

ABN , First Publish Date - 2021-04-18T05:24:22+05:30 IST

జిల్లాలోని చెరువులు, ఇతర తాగునీటి వనరులు అన్యాక్రా ంతం కాకుండా క్షేత్రస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని జేసీ వెంకటమురళీ ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌ నుంచి మండల అ ధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భగా జేసీ మాట్లాడుతూ చెరువుల భూములు ఆక్రమణకు గురికాకుండా వాటి ప రిధిలోని జంగిల్‌ను తొలగించాలన్నారు. వాటి సరిహద్దులను గుర్తించేందుకు సర్వే చేపట్టాలని ఆదేశించారు.

నీటి వనరులు అన్యాక్రాంతం కాకుండా చూడాలి
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ వెంకటమురళి

జేసీ వెంకటమురళీ ఆదేశం


ఒంగోలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 17 : జిల్లాలోని చెరువులు, ఇతర తాగునీటి వనరులు అన్యాక్రా ంతం కాకుండా క్షేత్రస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని జేసీ వెంకటమురళీ ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌ నుంచి మండల అ ధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భగా జేసీ మాట్లాడుతూ చెరువుల భూములు ఆక్రమణకు గురికాకుండా వాటి ప రిధిలోని జంగిల్‌ను తొలగించాలన్నారు. వాటి సరిహద్దులను గుర్తించేందుకు సర్వే చేపట్టాలని ఆదేశించారు. డ్వామా, రెవెన్యూ సిబ్బంది సం యుక్తంగా వారం రోజుల్లో ఆయా పనులు పూ ర్తి చేయాలని చెప్పారు. మధ్య తరగతి ఆదాయ వర్గాల వారికీ స్మార్ట్‌టౌన్‌ తరహాలో అభివృద్ధి చే సిన ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అవసరమైన భూ ములను గుర్తించాలన్నారు. జిల్లావ్యాప్తంగా 15 వేల దరఖాస్తులు వచ్చాయని, అయితే ముం దుగా ఒంగోలు, కందుకూరు, మార్కాపురం ప ట్టణాల్లో స్థలాలు  గుర్తించాలన్నారు. ఈనెల 20వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకా శం ఉందని, వాటి వివరాలను ఈనెల 22న జి ల్లా కేంద్రానికి పంపాలని సూచించారు.  అనం తరం పలు అంశాలపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో కె.వినాయకం, వివిధ శా ఖల అధికారులు కె.శీనారెడ్డి, జీవీ.నారాయణరె డ్డి, కొండయ్య, లక్ష్మీదేవి, పీవీ.శ్రీరామమూర్తి, కే శవరావు, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-18T05:24:22+05:30 IST