Tulluri Brahmaiahపై హత్యాయత్నం దుర్మార్గమైన చర్య

ABN , First Publish Date - 2022-06-30T17:59:13+05:30 IST

డీసీసీబీ డైరెక్టర్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు తుళ్లూరి బ్రహ్మయ్యపై మరణాయుధాలతో హత్యాయత్నానికి కొందరు ప్రయత్నించటం దుర్మార్గమైన

Tulluri Brahmaiahపై హత్యాయత్నం దుర్మార్గమైన చర్య

- పచ్చని ప్రాంతంలో చిచ్చు రాజేస్తున్నారు

- దుష్టశక్తులను ప్రోత్సహిస్తే మూల్యం చెల్లిస్తారు

- విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ పొంగులేటి


అశ్వాపురం(భద్రాద్రి కొత్తగూడెం): డీసీసీబీ డైరెక్టర్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు తుళ్లూరి బ్రహ్మయ్యపై మరణాయుధాలతో హత్యాయత్నానికి కొందరు ప్రయత్నించటం దుర్మార్గమైన చర్యఅని దీనిని తీవ్రంగా ఖండిస్తున్టట్లు మాజీఎంపీ టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన బ్రహ్మయ్యను పరామర్శించారు. అశ్వాపురంలోని బ్రహ్మయ్య ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈప్రాంతంలో దశాబ్ధాలుగా అన్నివర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉంటున్నారని, అటువంటి ప్రాంతంలో కొందరు ప్రత్యక్షంగా,పరోక్షంగా దుష్టశక్తులను ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. దుష్టశక్తులను ప్రోత్సహించేవారు తగినమూల్యం చెల్లించక తప్పదన్నారు. రెండురోజుల్లోనే చట్ట పరంగా వారి బండారాన్ని బయటపెడ్తామన్నారు. సొసైటీ కార్యాలయంలో ఉన్న బ్రహ్మయ్యపై హత్యాయత్నానికి పాల్పడితే పోలీసులు బ్రహ్మయ్యపైనే కేసులు నమోదు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోబోమని పోలీసు ఉన్నతాధికారుల, పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామన్నారు. బ్రహ్మయ్యపై ప్రత్యక్షంగా, పరోక్షంగా హత్యాయత్నానికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పొంగులేటి డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో జడ్పీచైర్మన్‌ కోరం కనకయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు, డీసీసీబీ డైరెక్టర్‌ తుళ్లూరి బ్రహ్మయ్య, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు మట్టా దయానంద్‌, వెంకటేశ్వర్‌రెడ్డి, అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత, స్థానిక సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.


ఇరువర్గాలపై కేసులు నమోదు

తుళ్లూరి బ్రహ్మయ్యపై జరిగిన దాడికి సంబంధించి అశ్వాపురం పోలీసుస్టేషన్‌లో ఇరువర్గాలపై కేసులు నమోదయ్యాయి. బ్రహ్మయ్య ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్‌ పాయం సత్యనారాయణతోపాటు 11మంది వ్యక్తులపై, సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బ్రహ్మయ్యతోపాటు 8 మంది వ్యక్తులపై కింద కేసులు నమోదు చేసినట్టు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - 2022-06-30T17:59:13+05:30 IST