డీఎంకే అకృత్యాలను బహిర్గతం చేయండి

Published: Sun, 27 Mar 2022 08:32:49 ISTfb-iconwhatsapp-icontwitter-icon
డీఎంకే అకృత్యాలను బహిర్గతం చేయండి

చెన్నై: డీఎంకే ప్రభుత్వ అకృత్యాలను, వైఫల్యాలను ఎక్కడికక్కడ బహిర్గతం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని బీజేపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు ఆ పార్టీ రాష్ట్ర సహ ఇన్‌చార్జ్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి సూచించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన వారితో ఆయన పెరంబలూర్‌లోని రామకృష్ణ ఇంజనీరింగ్‌ కళాశాలలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో సాగుతున్న సంక్షేమం, అభివృద్ధి గురించి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నయనార్‌ నాగేంద్రన్‌, సీకే సరస్వతి, ఉపాధ్యక్షుడు వీపీ దురైస్వామి, ప్రధాన కార్యదర్శి కేశవ వినాయగం తదితరులు కూడా పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.