పొన్నియిన్‌ సెల్వన్‌ పూర్తయింది

Sep 19 2021 @ 00:45AM

పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రీకరణకు దర్శకుడు మణిరత్నం గుమ్మడికాయ కొట్టారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన షెడ్యూల్‌తో ఈ సినిమా తొలి భాగం చిత్రీకరణ పూర్తయినట్టు శనివారం చిత్రబృందం ప్రకటించింది. వచ్చే వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చారిత్రక నేపథ్యంలో సాగే కాల్పనిక గాథతో మణిరత్నం ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. మణిరత్నం కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఐశ్వర్యారాయ్‌, విక్రమ్‌, జయం రవి, త్రిష, కార్తి కీలకపాత్రలు పోషిస్తున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.