చోళ రాజధానిలో పొన్నియిన్‌ టీజర్‌

Published: Sun, 19 Jun 2022 02:34:34 ISTfb-iconwhatsapp-icontwitter-icon
చోళ రాజధానిలో పొన్నియిన్‌ టీజర్‌

ణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. సెప్టెంబరు 30న విడుదలవుతోంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. జులై 07న ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ఇటీవలె ప్రకటించింది. ఇది చారిత్రక కాల్పనిక గాథతో తెరకెక్కుతున్న చిత్రం. చరిత్రలో చోళ రాజులు రాజధానిగా చేసుకున్న తంజావూరులోని బృహదీశ్వరాలయంలో ఈ చిత్రం టీజర్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను భారీఎత్తున నిర్వహించనున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.